Suspect Knocked Off Motorcycle: పోలీస్ మర్డర్.. హాలీవుడ్ రేంజ్‌లో ఛేజ్ చేసి మరీ..
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:57 PM
బైక్, పోలీసుల వాహనాలు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో హైవేపై వెళుతూ ఉన్నాయి. ఓ చోట దుండగుడి బైక్ పోలీస్ కారును ఢీకొట్టింది. ఒక్కసారిగా గాల్లో పల్టీలు కొడుతూ దూరంగా దూసుకుపోయి పడింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీస్ అధికారిని తుపాకితో కాల్చి చంపాడు(US Cop Shot). అనంతరం బైక్‌పై పరారయ్యాడు. పోలీసులు అతడ్ని ఛేజ్ చేశారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా హైవేపై ఛేజింగ్ జరిగింది. చివరకు ఆ హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం హాలీహాక్ డ్రైవ్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తుపాకితో మహిళను నిర్భంధించి వేధించసాగాడు.
ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీస్ అధికారి ఆండ్రూ న్యూజెన్ టీం అక్కడికి వచ్చింది. మహిళను దుండగుడి నుంచి రక్షించడానికి ప్రయత్నించింది. దీంతో రెచ్చిపోయిన ఆ దుండగుడు తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆండ్రూ న్యూజెన్ చనిపోయాడు. కాల్పుల అనంతరం ఆ దుండగుడు తన బైకుపై(Motorcycle Suspect) పరారయ్యాడు. పోలీసులు అతడ్ని వెంబడించారు. కొద్దిసేపటి తర్వాత బైక్ హైవేపైకి వచ్చింది. వాయు వేగంతో రోడ్డుపై దూసుకెళ్లసాగింది. పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. అతడ్ని అంతే వేగంతో ఛేజ్ చేయసాగారు.
బైక్, పోలీసుల వాహనాలు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో హైవేపై వెళుతూ ఉన్నాయి(High Speed Chase). ఓ చోట దుండగుడి బైక్ పోలీస్ కారును ఢీకొట్టింది. ఒక్కసారిగా గాల్లో పల్టీలు కొడుతూ దూరంగా దూసుకుపోయి పడింది. దుండగుడు కూడా దూరంగా ఎగిరిపడ్డాడు. బైక్ ముక్కలు, ముక్కలు అయింది. దుండగుడికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడిపై మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
చెర్నోబిల్‌లో ‘నీలి కుక్కలు’..!
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు