Chernobyl Blue Dogs: చెర్నోబిల్‌లో ‘నీలి కుక్కలు’..!
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:44 PM
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం కుక్కలు అక్కడ నీలి రంగులోకి మారడమే. తాజాగా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కనిపించిన కుక్కల ముఖాలు, రోమాలు నీలి రంగులో ఉండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం కుక్కలు(Chernobyl Blue Dogs) అక్కడ నీలి రంగులోకి మారడమే. తాజాగా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కనిపించిన కుక్కల ముఖాలు, రోమాలు నీలి రంగులో ఉండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఈ ఫొటోలను ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్’(Dogs of Chernobyl) అనే సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 1986లో జరిగిన చెర్నోబిల్ అణు ప్రమాదం(Ukraine nuclear disaster) ఘటన అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత అక్కడ మిగిలిపోయిన పెంపుడు కుక్కల తరాలు ఇవే. ఈ సంస్థ గత కొన్నేళ్లుగా ఈ కుక్కలకు ఆహారం, వైద్య సేవలు, ఆశ్రయం కల్పిస్తోంది. 11వేల ఎకరాల్లో ఉన్న చెర్నోబిల్ జోన్‌లో దాదాపు 700 కుక్కలు ఉన్నాయని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సంస్థ తెలిపింది.
కెమికల్స్ కారణం..!
ఇటీవలి సాధారణ వైద్య పరీక్షల సమయంలో మూడు కుక్కల రోమాలు ఆకస్మాత్తుగా నీలి రంగులోకి మారాయని సంస్థకు చెందిన పలువురు తెలిపారు. ఈ మార్పు వెనుక కారణం ఏమిటో ఇప్పటికీ తేలలేదు. అయితే ఏదో రసాయన పదార్థం ఈ కుక్కల శరీరానికి తగిలి ఉండవచ్చని సంస్థ నిర్వాహకులు అనుమానిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఇతర కారణాలపై పరిశోధన చేస్తున్నారు. పర్యావరణంలో ఉన్న ఇండస్ట్రియల్ కెమికల్స్ లేదా హెవీ మెటల్స్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నీలి కుక్కల నుంచి జుట్టు, చర్మం, రక్త నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.
దీనిపై ‘డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్’ సంస్థ స్పందించింది. ‘మేము ఇప్పటికీ దీనికి కచ్చితమైన కారణాలేంటో కనుగొన లేకపోయాం. ఈ కుక్కలు చాలా చురుకుగా ఉన్నాయి. ఒక్కసారిగా వింత రంగులోకి మారినప్పటికీ.. ఆ కుక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి’ అని సంస్థ తెలిపింది.
Also Read:
సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు
బిల్ ఎగ్గొట్టి పారిపోయేందుకు ప్రయత్నం.. వాళ్లను ఎలా పట్టుకున్నారంటే..