Dine and dash caught: బిల్ ఎగ్గొట్టి పారిపోయేందుకు ప్రయత్నం.. వాళ్లను ఎలా పట్టుకున్నారంటే..
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:34 PM
రాజస్థాన్‌లో తాజాగా జరిగిన ఓ ఫన్నీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌కు చెందిన ఐదుగురు టూరిస్ట్‌లు వేసిన ప్లాన్‌ను రెస్టారెంట్ యజమాని చిత్తు చేశారు. దీంతో వారు పోలీసులకు చిక్కారు.
రాజస్థాన్‌లో తాజాగా జరిగిన ఓ ఫన్నీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌కు చెందిన ఐదుగురు టూరిస్ట్‌లు వేసిన ప్లాన్‌ను రెస్టారెంట్ యజమాని చిత్తు చేశారు. దీంతో వారు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌కు చెందిన ఐదుగురు పర్యాటకులు రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సమీపంలోని సియావాలోని హ్యాపీ డే హోటల్‌కు వెళ్లారు (Gujarat tourists dine and dash).
ఆ హోటల్‌లో ఆ ఐదుగురు వ్యక్తులు పలు వస్తువులు ఆర్డర్ చేసి కడుపు నిండా భోజనం చేశారు. దాంతో బిల్లు రూ.10, 900 అయింది. బిల్లు చెల్లించే సమయం వచ్చినపుడు ఆ ఐదుగురు పాత ట్రిక్ ఉపయోగించి ఆ హోటల్ నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నించారు. టాయిలెట్‌కి వెళ్తున్నామనే నెపంతో ఒకరి తర్వాత ఒకరు రెస్టారెంట్ బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. హోటల్ యజమాని, వెయిటర్ ఏమి జరుగుతోందో గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో కారు గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు అయిన అంబాజీ వైపు వెళుతున్నట్లు కనిపించింది. అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ కారులో వారు ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. దీంతో వారు తమ స్నేహితుడికి ఫోన్ చేసి బిల్లు చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి స్టంట్.. చివరకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 37 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..