First Women Only Police Encounter: చరిత్రలో మొదటిసారి.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా పోలీసులు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:51 PM
అతడు స్కూటీ మీద నుంచి కిందకు జారి పడ్డాడు. పోలీసులు జితేంద్ర దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతడు రెచ్చిపోయాడు. పోలీసులపై తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ చరిత్రలో మొదటి సారి మహిళా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. ఓ రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందగ్రామ్ ఉపాసనా పాండే తెలిపిన వివరాల మేరకు.. సోమవారం రాత్రి కొంతమంది మహిళా పోలీసులు లోహియా నగర్‌లో పాట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జితేంద్ర కుమార్ అనే హిస్టరీ షీటర్ స్కూటీ మీద వారికి ఎదురుగా వచ్చాడు. స్కూటీ ఆపాలంటూ పోలీసులు అతడికి సిగ్నల్ ఇచ్చారు. అయితే, జితేంద్ర స్కూటీ వెనక్కు తిప్పి పరుగులు పెట్టించాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత స్కూటీ స్కిడ్ అయింది.
అతడు స్కూటీ మీద నుంచి కిందకు జారి పడ్డాడు. పోలీసులు జితేంద్ర దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతడు రెచ్చిపోయాడు. పోలీసులపై తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే మహిళా పోలీసులు కూడా ఫైరింగ్ మొదలెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జితేంద్ర కాలికి బులెట్ తగిలింది. అతడు నేలపై కుప్పకూలిపోయాడు. చేతిలోని తుపాకి దూరంగా వెళ్లి పడింది. పోలీసులు పరుగున వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏసీపీ ఉపాసన పాండే మాట్లాడుతూ.. ‘అతడి పేరు జితేంద్ర. ప్రస్తుతం అతడు విజయ్‌నగర్‌లో ఉంటున్నాడు. జితేంద్ర స్వస్థలం అలీఘర్. విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై హిస్టరీ షీట్ ఉంది. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లలో అతడిపై ఎనిమిదికిపైగా కేసులు ఉన్నాయి. దొంగిలించిన స్కూటీపై వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. పట్టుకోవడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి స్కూటీ, పిస్టల్, మొబైల్ ఫోన్ ట్యాబ్లెట్ స్వాధీనం చేసుకున్నాము. గాయపడ్డ అతడ్ని ఆస్పత్రికి తరలించాము’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రముఖ నటుల నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు..
నటుడి గొప్ప మనసు.. ఆ కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం..