Share News

Shocking: నల్ల పిల్లి ఎదురొచ్చిందని.. ఆ యువతులు చేసిన పని ఏంటో తెలిస్తే వణికిపోవాల్సిందే..

ABN , Publish Date - Mar 10 , 2025 | 09:04 PM

తాము అశుభంగా భావించేవి ఏవి దారిలో ఎదురొచ్చినా కొందరు తిరిగి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని మళ్లీ వెళ్తారు. అలా చాలా మంది అశుభంగా భావించే వాటిలో నల్ల పిల్లి కూడా ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళలకు అలాగే నల్ల పిలి ఎదురు వచ్చిందట.

Shocking: నల్ల పిల్లి ఎదురొచ్చిందని.. ఆ యువతులు చేసిన పని ఏంటో తెలిస్తే వణికిపోవాల్సిందే..
Black Cat

కొందరు వ్యక్తులు కొన్ని విషయాలను బలంగా నమ్ముతారు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ముహూర్తం, వర్జ్యం వంటివి చూసుకుంటారు. ఎదురుగా ఎవరు వస్తున్నారనే విషయాన్ని కూడా కొందరు పట్టించుకుంటారు. తాము అశుభంగా భావించేవి ఏవి దారిలో ఎదురొచ్చినా తిరిగి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని మళ్లీ వెళ్తారు. అలా చాలా మంది అశుభంగా భావించే వాటిలో నల్ల పిల్లి కూడా ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)కు చెందిన ఇద్దరు మహిళలకు అలాగే నల్ల పిల్లి (Black Cat) ఎదురు వచ్చిందట (Viral News).


ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నల్ల పిల్లి ఎదురైతే వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోరని చాలా మందిలో బలమైన నమ్మకం ఉంది. ఉత్తరప్రదేశ్‌‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితులు కలిపి బయటకు వెళ్తుండగా నల్ల పిల్లి ఎదురువచ్చింది. అంతే.. వారు ఆ పిల్లిని వెంటాడి పట్టుకుని సజీవదహనం చేశారు. అంతేకాదు ఆ ఘటన మొత్తాన్ని రికార్డ్ కూడా చేశారు. ఆ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో బాగా వైరల్ అయి ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.


వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆ ఘటనకు సంబంధించిన వీడియోతో సహా యూపీలోని భోజ్‌పూర్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా బైక్‌ నంబర్‌ను ట్రేస్‌ చేశారు. ఆ బైక్ భోజ్‌పూర్‌కు చెందిన ప్రియ అనే యువతిది అని గుర్తించారు. దీంతో ప్రియ, ఆమె స్నేహితులపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో దోషులగా తేలితే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి..

Jugaad Viral Video: వావ్.. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా.. ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..


Boy Stunt Video: ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. సైకిల్‌తో కళ్లు చెదిరే స్టంట్ చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 10 , 2025 | 09:27 PM