Principal Threatens Girl: విద్యార్థినికి వార్నింగ్ ఇచ్చిన ప్రిన్సిపల్.. చంపి పారేస్తా అంటూ..
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:33 PM
9వ తరగతి చదివే బాలికకు ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చింది. అందరి ముందూ చంపి పారేస్తా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఓ ప్రిన్సిపల్ ఆగ్రహానికి గురైంది. 9వ తరగతి విద్యార్థినిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. తన మాట విననందుకు చంపి పారేస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి విద్యార్థిని కుటుంబసభ్యులు చెప్పిన వివరాల మేరకు.. హపుర్ జిల్లాలోని పిఖువాలో వీఐపీ ఇంటర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువు చెబుతున్నారు. ఈ కాలేజీలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కొద్దిరోజుల క్రితం క్లాస్ బయట స్నేహితురాలితో కలిసి నిల్చుని ఉంది.
ప్రిన్సిపల్ వారిద్దరినీ అక్కడినుంచి వెళ్లిపొమ్మంది. ఆ బాలిక కొంచెం లేటుగా స్పందించింది. దీంతో ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. బాలికపై ఫైర్ అయింది. ‘నిన్ను చంపి పారేస్తా’ అంటూ మండిపడింది. దీన్నంతా అక్కడే ఉన్న ఓ విద్యార్థి వీడియో తీశాడు. ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చిన సంగతి బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారు వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘మా బిడ్డ బాగా భయపడిపోయింది. స్కూలుకు వెళ్లాలంటేనే జంకుతోంది. ప్రిన్సిపల్ వార్నింగ్ కారణంగా మా కూతురు మెంటల్ హెల్త్ దెబ్బతింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. ప్రిన్సిపల్ వార్నింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు. కఠినంగా శిక్షించాలి’..‘ఆదర్శంగా నిలవాల్సిన వారే దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇక పిల్లలు ఏం నేర్చుకుంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు..
‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ