Couple Caught On Camera: కేడీ కపుల్.. మాటల్లో పెట్టి 6 లక్షల నగ కొట్టేశారు..
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:42 PM
ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిందో స్పష్టంగా ఉంది.
ఈ కన్నింగ్ భార్యాభర్తల తెలివి తేటలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారం షాపు యజమానిని మాటల్లో పెట్టి ఏకంగా ఆరు లక్షల విలువ చేసే నగను కొట్టేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బులందర్‌షహర్‌కు చెందిన భార్యాభర్తలు డీఎమ్ రోడ్డులోని ఓ ప్రముఖ బంగారు నగల షాపులోకి వెళ్లారు. తనకు మంచి నెక్లెస్ చూపించమని మహిళ షాపు అతడ్ని అడిగింది.
భార్యాభర్తలు సోఫాలో కూర్చోగా షాపు అతను నగల్ని చూపిస్తూ ఉన్నాడు. మహిళ నగల్ని చూస్తూ ఉంది. భర్త సైలెంట్‌గా పక్కన కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ ఓ నగను తన చీరలో దాచుకుంది. ఓ అరగంట తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ కొనకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. రాత్రి నగల లెక్కలు చూసుకోగా ఓ నగ మిస్ అయినట్లు షాపు యజమానికి తెలిసింది. వెంటనే సీసీ టీవీ కెమెరాలను పరిశీలించాడు. భార్యాభర్తల గుట్టు రట్టయింది.
చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వారిని పట్టుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిందో స్పష్టంగా ఉంది.
ఇవి కూడా చదవండి
కర్రల సమరం.. బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం..
200 ఏళ్ల శాపం.. మగాళ్లు చీరలు కట్టుకుని డ్యాన్సులు..