200 Year Old Curse Ritual: 200 ఏళ్ల శాపం.. మగాళ్లు చీరలు కట్టుకుని డ్యాన్సులు..
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:05 PM
200 ఏళ్లు అయినా ఆ ఆచారం కొంచెం కూడా మారలేదు. ఇప్పటి తరం వారు కూడా ఎంతో భక్తితో ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతీ ఏటా దేవీ నవరాత్రుల సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఓ వింత చోటుచేసుకుంటుంది. మగాళ్లు ఆడవాళ్లలా చీరకట్టుకుని గర్భ ఆడతారు. నవరాత్రుల్లోని ఎనిమిదవ రోజు రాత్రి మగాళ్లు చీరలు కట్టుకుని డ్యాన్సులు చేస్తారు. దీని వెనుక 200 ఏళ్ల చరిత్ర ఉంది. 200 ఏళ్ల క్రితం మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తి సాధుబెన్ అనే మహిళను చెరపట్టాలని చూశాడు. దీంతో ఆమె బరోత్ జాతికి చెందిన మగాళ్లను శరణు వేడింది.
అతడి వద్దనుంచి తనకు రక్షణ కల్పించమని కోరింది. అయితే, వాళ్లు ఆమెకు అండగా నిలబడలేదు. ఈ నేపథ్యంలోనే సాధుబెన్ తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఆ కోపంలో ఆమె బరోత్ జాతి మగాళ్లను.. ‘ఇకపై మీ వారసులు పిరికివాళ్లలా బతుకుతారు’ అని శపించింది. తర్వాత ఆమె ప్రాణ త్యాగానికి పాల్పడింది. ఇక, అప్పటినుంచి ఆ జాతి వారు సాధుబెన్‌ను దేవతగా కొలుస్తున్నారు. ఆమెకు గౌరవంగా మగాళ్లు ఇప్పటికీ చీరలు కట్టుకుని గర్భ ఆడుతున్నారు.
200 ఏళ్లు అయినా ఆ ఆచారం కొంచెం కూడా మారలేదు. ఇప్పటి తరం వారు కూడా ఎంతో భక్తితో ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ మగాళ్లు చాలా గ్రేట్. ఇప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎగతాళి చేయకుండా.. సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 11 మంది మృతి