Share News

Tiger Attack: వ్యక్తిపై పులి దాడి.. ఆ తర్వాత మంచం మీద...

ABN , Publish Date - Dec 30 , 2025 | 10:50 AM

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి.. ఆ తర్వాత మంచంపై కూర్చుంది.

Tiger Attack: వ్యక్తిపై పులి దాడి.. ఆ తర్వాత మంచం మీద...
Tiger on Cot

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఓ పులి బీభత్సం సృష్టించింది. బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలోని ఓ పులి.. సమీపంలోని గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేసి(Tiger Attacks).. ఆ తర్వాత మంచమ్మీద హుందాగా కూర్చుంది(Tiger Sits on Cot). దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకెళితే...


బంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనంలోని(Bandhavgarh National Park) ఓ పులి.. ఊళ్లోకి చొరబడింది. అక్కడ ఆరుబయట కూర్చున్న గోపాల్ కోల్(Gopal Kol) అనే వ్యక్తిపై దాడికి దిగి.. ఒక్కసారిగా నేలకేసి కొట్టింది. ఆ తర్వాత దుర్గాప్రసాద్ ద్వివేది ఇంట్లోకి వెళ్లి.. తనకేమీ పట్టనట్టు ఎంచెక్కా కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. ఆ సమయంలో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటి పైకప్పులు ఎక్కడివారు అక్కడ దాక్కున్నారు. ప్రస్తుతం.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.


విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. వెంటనే ఆ ఊరికి చేరుకున్నారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఊరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. గాయపడిన గోపాల్‌ను చికిత్స నిమిత్తం కాట్నీ జిల్లా(Katni District)లోని బర్హి ఆసుపత్రికి తరలించారు అటవీ శాఖ అధికారులు. ప్రస్తుతం.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.


ఇవీ చదవండి:

పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Updated Date - Dec 30 , 2025 | 10:54 AM