Share News

Lord Vishnu : ఈ విష్ణుమూర్తి విగ్రహం, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది. అయితే, భారతదేశంలో లేదు

ABN , Publish Date - Aug 12 , 2025 | 09:22 PM

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన హిందూ దేవుడు విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా.. అదీ భారత దేశంలో కాదు. ఇది ఇండోనేషియా దేశంలో ఉంది. బాలిలోని గరుడ విష్ణు కెంచన విగ్రహం ఒక సాంస్కృతిక అద్భుతం.

Lord Vishnu :  ఈ విష్ణుమూర్తి విగ్రహం,  స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైనది.  అయితే,  భారతదేశంలో లేదు
Lord Vishnu

Garuda Visnu Statue: అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన హిందూ దేవుడు విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా.. అదీ భారత దేశంలో కాదు. ఇది ఇండోనేషియా దేశంలో ఉంది. ఈ అతిపెద్ద గరుడ వాహన విష్ణు విగ్రహం బాలిలోని ఉంగసాన్‌లో గరుడ విష్ణు కెంచన సాంస్కృతిక పార్కులో ఉంది. ఈ విగ్రహం హిందూ దేవుడైన విష్ణువు తన వాహనమైన గరుడును అధిరోహించిన రూపంలో ఉంటుంది. గరుడ.. శక్తి, వేగం, భక్తిని సూచిస్తాడు. విష్ణువు విశ్వ సంరక్షకుడిగా పరిగణించబడతారు. ఈ విగ్రహం హిందూ పురాణాలలోని గరుడు.. తన తల్లిని బానిసత్వం నుండి విముక్తి చేయడానికి అమృతాన్ని సంపాదించిన కథను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది.

Lord-Vishnu-devotees.jpg


ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ పంచసీలకు కూడా ఈ విగ్రహం ఒక సాంస్కృతిక ప్రతీకగా నిలుస్తుంది. ప్రఖ్యాత బాలినీస్ శిల్పి న్యోమన్ నువార్తా రూపొందించిన ఈ విగ్రహం 1990లో ప్రారంభమై, ఆర్థిక సంక్షోభాలు, ఇతర సవాళ్ల కారణంగా 28 సంవత్సరాల తర్వాత 2018లో పూర్తయింది.

garuda-wisnu-kencana-3.jpg రాగి, ఇత్తడి, ఉక్కుతో నిర్మితమైన ఈ 4000 టన్నుల బరువున్న విగ్రహం 754 భాగాలుగా బందుంగ్‌లో తయారు చేయబడి, బాలిలో ప్రతిష్టించబడింది. విష్ణువు శిరస్సుపై బంగారు మొజాయిక్‌లతో అలంకరించిన కిరీటం ఈ విగ్రహానికి ప్రత్యేక ఆకర్షణ.

garuda-wisnu-kencana.jpg


GWK సాంస్కృతిక పార్కు కేవలం విగ్రహంతోనే కాకుండా, సాంప్రదాయ బాలినీస్ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సంగీత కచేరీలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. లోటస్ పాండ్, జెండెలా బాలి రెస్టారెంట్, ఆర్ట్ గ్యాలరీలు ఈ పార్కులోని ఇతర ఆకర్షణలు. ఈ పార్కు బాలి సంస్కృతి, హిందూ ఆధ్యాత్మికత, ఇండోనేషియా జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తుంది.

garuda-wisnu-kencana-2.jpg

Updated Date - Aug 12 , 2025 | 09:38 PM