Viral Jugaad: ఇతనెవరో కానీ చాలా ట్యాలెంటెడ్, ఇతడి తెలివితేటలను ప్రశంసించకుండా ఉండలేం..
ABN , Publish Date - Feb 01 , 2025 | 06:43 PM
మన దేశంలో చాలా మంది తక్కువ ఖర్చుతో పనులను పూర్తి చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
మన దేశంలో ప్రతిభకు, సృజనాత్మకతకు (Creativity) కొదవ లేదు. చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అసాధారణంగా ఆలోచిస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా సులభమైన పరిష్కారం కనుగొంటారు. చాలా తక్కువ ఖర్చుతో పనులను పూర్తి చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Jugaad).
@Superoverr అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఇంటి గోడపై గడియారం కనిపిస్తోంది. ఆ గడియారం (Clock) ఒక వైపు విరిగిపోయింది. 1 నుంచి 4 వరకు అంకెలు పోయాయి. అయితే ఆ గడియారం మాత్రం బాగానే పని చేస్తోంది. దీంతో ఇంటి యజమాని తన క్రియేటివిటీ ఉపయోగించి అద్భుతంగా ప్లాన్ చేశాడు. పోయిన ఆ సంఖ్యలను గోడ మీద చాలా ఖచ్చితమైన స్థానంలో బాగా రాశాడు. అంతే కాదు గడియారానికి బార్డర్ కూడా తయారు చేశాడు. దీంతో విరిగిపోయిన ఆ గడియారం కూడా సరైన సమయాన్ని తెలియజేస్తోంది.
ఆ వ్యక్తి క్రియేటివిటీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. వేల మంది ఆ పోస్ట్‌ను వీక్షించారు. వందల మంది ఆ ఐడియాను లైక్ చేసి తమ ప్రశంసలను తెలియజేశారు. ``ఇది నెక్ట్స్ లెవెల్ క్రియేటివిటీ``, ``ఇది నిజంగా ఓ కళ``, ``నిజమైన గాడియారం కంటే అందంగా ఉంది``, ``ఇది సామాన్య భారతీయుడి తెలివి``, ``అతడి క్రియేటవిటీకి సలాం కొట్టాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Car Stunt: ఇంత రిస్క్ అవసరమా తమ్ముడూ? వీడియో కోసం కారుతో స్టంట్ చేద్దామనుకుంటే..
Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి