Share News

Viral Jugaad Video: ఇండియన్స్ అంటే అందరూ భయపడాల్సిందే.. ఈ జుగాడ్ వీడియో చూస్తే షాక్..

ABN , Publish Date - Jul 30 , 2025 | 07:44 PM

విభిన్నమైన పనులు, విచిత్రమైన ప్రయోగాలు చేసే వారికి సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని వ్యక్తి నైపుణ్యం చూస్తే ఆశ్చర్యంతో కళ్లు తేలెయ్యాల్సిందే.

Viral Jugaad Video: ఇండియన్స్ అంటే అందరూ భయపడాల్సిందే.. ఈ జుగాడ్ వీడియో చూస్తే షాక్..
Viral Jugaad Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విభిన్నమైన పనులు, విచిత్రమైన ప్రయోగాలు చేసే వారికి సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ జుగాడ్ వీడియో (Jugaad Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని వ్యక్తి నైపుణ్యం చూస్తే ఆశ్చర్యంతో కళ్లు తేలెయ్యాల్సిందే.


@TnuBlyn1 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి గోడకు ఓ స్విచ్ బోర్డ్ (Electric board) అమర్చినట్టు కనిపిస్తోంది. అయితే అది నిజానికి స్విచ్ బోర్డు కాదు. ఓ వ్యక్తి ఆ స్విచ్ బోర్డు ప్లగ్‌లోకి ఓ తాళం చెవి పెట్టి తిప్పాడు. అనంతర ఆ స్విచ్ బోర్డును బయటకు లాగితే ఓ సొరుగులా బయటకు వచ్చింది. దాని లోపల డబ్బులు లేదా ఇతర విలువైన వస్తువులను పెట్టుకునేందుకు వీలుగా ఆ సేఫ్‌ (Safe)ను రూపొందించారు. ఆ వెరైటీ సొరుగును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 68 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇండియాలో చాలా ప్రమాదకర వ్యక్తులు ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వీళ్లను చూస్తే దొంగలందరూ షాక్ అవుతారని మరొకరు పేర్కొన్నారు. దొంగలను బోల్తా కొట్టించే గొప్ప ట్రిక్ అంటూ మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

వేదిక మీద గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి.. కారణమేంటంటే..

మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఏనుగుల మధ్యలోనున్న రైనోను 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 07:44 PM