Share News

Viral Bike Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. లారీ కింద పడినా వీళ్లు ఎలా బతికారో చూడండి..

ABN , Publish Date - Feb 17 , 2025 | 07:40 PM

ఎంతో అదృష్టం ఉంటే తప్ప ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం అనేది జరగదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు లారీ కింద పడినా ప్రాణాలతో బయటపడ్డారు.

Viral Bike Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. లారీ కింద పడినా వీళ్లు ఎలా బతికారో చూడండి..
Bike accident

అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడిపోయినా ఎలాగోలా ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తారు. ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా క్షేమంగా బయటపడతారు. ముఖ్యంగా బైక్‌ల (Bikes) మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ప్రమాదం (Accident) నుంచి క్షేమంగా బయటపడడం అనేది జరగదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు లారీ (Truck) కింద పడినా ప్రాణాలతో బయటపడ్డారు (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని వాహనాలు రోడ్డుపై వెళ్తున్నాయి. ఒక కారు, లారీ పక్క పక్కనే ప్రయాణిస్తున్నాయి. ఇంతలో, ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వేగంగా ముందుకు వచ్చారు. కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కారుకు బైక్ తగిలి అదుపు తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. సరిగ్గా అదే సమయంలో లారీ వస్తోంది. అయితే లారీ చక్రాల వారి పక్క నుంచి వెళ్లిపోయాయి. దాంతో వారు ప్రాణాలతో బయటపడగలిగారు. ఆ ఘటనను కారులో వస్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించాడు.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. వేయి మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``వారు మరణానికి చాలా దగ్గరగా వెళ్లారు``, ``ఆ సమయంలో యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో``, ``అదృష్టం అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: కేక్‌లో క్రాకర్ పెట్టాడు.. వెలిగించి అందరికీ షాకిచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్..


Shocking Viral Video: బాబూ.. నీకు ప్రాణాలంటే లెక్క లేదా.. ఈ కుర్రాడు ట్రైన్ ఎలా దిగాడో చూస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..


Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 05:28 PM