Share News

History Viral: అక్బర్ కుమార్తెతో హిందూ రాజు వివాహం.. రాజ్‌పుత్-మొఘల్ కూటమి వెనుక అసలు కథ ఇదే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:00 PM

భారతదేశాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో మొఘల్ చక్రవర్తులు చాలా ఏళ్ల పాటు పాలించారు. అయితే మొఘల్ చక్రవర్తులు, హిందూ రాజుల మధ్య ఓ ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది.

History Viral: అక్బర్ కుమార్తెతో హిందూ రాజు వివాహం.. రాజ్‌పుత్-మొఘల్ కూటమి వెనుక అసలు కథ ఇదే..

భారతదేశాన్ని అనేక మంది చక్రవర్తులు పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో మొఘల్ చక్రవర్తులు చాలా ఏళ్ల పాటు పాలించారు. అయితే మొఘల్ చక్రవర్తులు, హిందూ రాజుల మధ్య ఓ ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. మహారాణా ప్రతాప్ కుమారుడు మహారాణా అమర్ సింగ్ , మొఘల్ చక్రవర్తి అక్బర్ కుమార్తె షహజాది ఖనుమ్ బేగంను వివాహం చేసుకున్నాడు . అప్పట్లో మతాంతర వివాహాలు చాలా చాలా అరుదు. దీంతో వీరి వివాహం అప్పటికీ, ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఈ వివాహంతో మొఘల్ ఆస్థాన యువరాణిని వివాహం చేసుకున్న మొదటి హిందూ రాజుగా అమర్ సింగ్ గుర్తింపు పొందాడు. ఈ వివాహం వెనుక ఉన్న కథలోకి వెళ్తే..


మేవార్ రాజ్యానికి 14వ పాలకుడైన మహారాణా అమర్ సింగ్.. తన తండ్రి మహారాణా ప్రతాప్ మరణం తర్వాత 1597లో సింహాసనాన్ని అధిష్టించాడు. గెరిలా యుద్ధాలు చేయడం ద్వారా అక్బర్, జహంగీర్ రాజులను తీవ్రంగా ప్రతిఘటించాడు. అయితే దశాబ్దాల పాటు యుద్ధాలు చేయడం వల్ల మేవార్ సమ్రాజ్యం ఆర్థికంగా చితికిపోయింది. సైనిక బలంతో పాటూ ఆర్థిక పరంగా కూడా అమర్ సింగ్ తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది.


ఈ క్రమంలో అమర్ సింగ్‌కు, జహంగీర్‌కు మధ్య 615 ADలో శాంతి ఒప్పందం కుదిరింది. చిత్తూరు సహా ఇతరు భూభాగాలను మేవార్‌కు తిరిగి ఇచ్చేలా ఒప్పదం కుదుర్చుకున్నారు. అలాగే శాంతి ఒప్పదంలో భాగంగానే అమర్ సింగ్ మొఘల్ యువరాణి షహజాది ఖానుమ్ బేగంను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ చరిత్రకారులు ఈ వివాహాన్ని అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత 1615లో జరిగిన ఒప్పదంలో మొఘల్ రాజవంశంతో ఇకపై మేవార్ ఎలాంటి సంబంధాలను కలిగి ఉండదని పేర్కొన్నారు.


అయితే చరిత్రలో ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. మొఘల్ చక్రవర్తుల కుమార్తెలు వివాహం చేసుకోలేదు. యువరాణుల వివాహాన్ని వీరు నిషేధించారని చెబుతుంటారు. మరోవైపు చరిత్రకారులు ఇది కరెక్ట్ కాదు అని అంటుంటారు. మొఘల్ సామ్రాజ్యంలో యువరాణులు వివాహం చేసుకున్నారు. అయితే వారంతా దగ్గరి బంధువులను మాత్రమే వివాహం చేసుకున్నారు. దీనికి కూడా అసలు కారణాలు తెలియరాలేదు. రాజులు తమ బంధువులకు చక్రవర్తి పదవి ఇవ్వాలని, దానికి తామే పాలకులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారని చెబుతుంటారు. ఈ సాంప్రదాయం ప్రకారమే అమర్ సింగ్ అక్బర్ కుమార్తెను వివాహం చేసుకున్నాడని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 02:00 PM