Acid injection: షాకింగ్.. సిక్స్ ప్యాక్ కోసం పిచ్చి పని.. చైనా వ్యక్తి ఏం చేశాడంటే..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:50 AM
శరరీ బరువు తగ్గించుకోవాలంటే ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. అలాంటివేవీ చేయకుండా బరువు తగ్గించే షార్ట్ కట్స్ కోసం కొందరు ప్రయత్నిస్తుంటారు. అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి యాసిడ్ ఇంజెక్షన్లతో ఎయిట్ ప్యాక్ బాడీ కోసం ట్రై చేస్తున్నాడు
కొన్ని సంవత్సరాల పాటు జిమ్‌లో చెమటలు పట్టించి, డైట్ పాటించి, ప్రోటీన్ షేక్స్ తాగి, ఎంతో సహనంతో ఉంటే తప్ప సిక్స్ ప్యాక్ సాధించడం సాధ్యం కాదు. సాధారణంగా శరరీ బరువు తగ్గించుకోవాలన్నా ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. అలాంటివేవీ చేయకుండా బరువు తగ్గించే షార్ట్ కట్స్ కోసం కొందరు ప్రయత్నిస్తుంటారు. అనారోగ్యం బారిన పడుతుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి యాసిడ్ ఇంజెక్షన్లతో ఎయిట్ ప్యాక్ బాడీ కోసం ట్రై చేస్తున్నాడు (acid injections bodybuilder).
చైనాలోని షాంఘైకు చెందిన ఒక వ్యక్తి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. అతని శరీరాకృతి చూసి, అది నిజమా లేక సైన్స్ ఫిక్షన్ సినిమాలోనిదా అని ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అతడు జిమ్‌లో కష్టపడి ఆ శరీరాకృతి సాధించలేదు. డాక్టర్లను కూడా భయపెట్టే షార్ట్‌కట్‌తో అతడు ఎయిట్ ప్యాక్ బాడీ సంపాదించాడు. హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లతో అతడు ఎయిట్ ప్యాక్ బాడీ సాధించాడు. ఈ యాసిడ్ నిజానికి మన చర్మం, కీళ్లలో కనిపించే సహజ పదార్థం (bodybuilding news).
ఈ హైలురోనిక్ యాసిడ్‌ను సాధారణంగా కాస్మెటిక్ సర్జీరలలో ఫిల్లర్లుగా ఉపయోగిస్తారు. కానీ, ఈ చైనా వ్యక్తి దీనిని కండరాలను నిర్మించే సాధనంగా మార్చాడు. 1–2 మి.లీ. యాసిడ్‌ను ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే శరీరంలోని కణజాలం ఉబ్బి కృత్రిమ కండరాల రూపాన్ని ఇస్తుంది. అతడు తన భుజాలు, కాలర్‌బోన్‌లు, ఛాతీ, కడుపు వంటి అన్ని చోట్లా హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడి శరీరం 20 శాతం యాసిడ్‌తో నిండి ఉందట. మొత్తం పది వేల డోస్‌లు తీసుకోవాలట. ప్రస్తుతానికి 40 శాతం పని పూర్తయిందట. అందుకోసం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట (acid injection scandal).
హైలురోనిక్ యాసిడ్‌ను కాస్మెటిక్ ఫిల్లర్ల కోసమే ఎఫ్‌డీఏ ఆమోదించిందని, దానిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు (viral china story). అధిక మోతాదులో హైలురోనిక్ యాసిడ్‌ను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం, కణాలు నాశనం కావడం వంటివి సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. శరీరం ఆ యాసిడ్‌ను శోషించుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ ఎనిమిది ప్యాక్‌లు వాటంతట అవే మాయమవుతాయట.
ఇవీ చదవండి:
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..
మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ మంచులో పెంగ్విన్‌ను 15 సెకెన్లలో కనిపెట్టండి..