Share News

Lion Video: సింహం భోజనం చేస్తున్నప్పుడు డిస్ట్రబ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. మృగరాజుకు ఎంత కోపం వచ్చిందంటే..

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:45 AM

సింహం అంటే అడవికి రారాజు. సింహం జోలికి వెళితే ఎలాంటి జంతువైనా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక, మనుషులు అయితే సింహాన్ని చూస్తే చాలా భయపడతారు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. కొన్ని దేశాల్లో సింహాలు, పులులను పెంచుకుంటున్నారు.

Lion Video: సింహం భోజనం చేస్తున్నప్పుడు డిస్ట్రబ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. మృగరాజుకు ఎంత కోపం వచ్చిందంటే..
Lion Viral Video

సింహం (Lion) అంటే అడవికి రారాజు. సింహం జోలికి వెళితే ఎలాంటి జంతువైనా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక, మనుషులు అయితే సింహాన్ని చూస్తే చాలా భయపడతారు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితి మారింది. కొన్ని దేశాల్లో సింహాలు, పులులను పెంచుకుంటున్నారు. ఇక, జంగిల్ సఫారీ పేరుతో చాలా మంది అడవుల్లోకి వెళ్లి పులులు, సింహాలను వీడియోలు తీస్తున్నారు. దీంతో ఆ క్రూరమృగాలు (Wild Animals) కూడా మనుషులకు అలవాటు పడుతున్నాయి.


గుజరాత్‌లోని భావ్‌నగర్‌ (Bhavnagar)లో ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి సింహం దగ్గరకు వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @Ranjeetraghu అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సింహం ఓ జంతువును వేటాడి దానిని తింటోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి వీడియో తీసుకుంటూ ఆ సింహం వైపు వెళ్తున్నాడు. దాంతో ఆ సింహానికి కోపం వచ్చింది. పైకి లేచి అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అతడు వెనకడుగు వేయడంతో కాస్త నెమ్మదించింది.


ఆ వ్యక్తి ముందుకు వెళ్తుంటే చాలా మంది అరుపులు, కేకలు వేయడం వినిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. సింహం అతన్ని సులభంగా చంపి ఉండేదని, కానీ దయ చూపించి వదిలేసిందని ఒకరు కామెంట్ చేశారు. అతడి మూర్ఖత్వానికి హద్దులు లేవని మరొకరు విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఆంటీ తెలివికి ఫిదా కావాల్సిందే.. గిన్నెలను క్లీన్ చేయడానికి కొత్త టెక్నిక్ చూడండి..

మీ బ్రెయిన్‌ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో Vల మధ్యనున్న U అక్షరాన్ని కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 09 , 2025 | 12:40 PM