Share News

Viral Jugaad Video: ఈ ఆంటీ తెలివికి ఫిదా కావాల్సిందే.. గిన్నెలను క్లీన్ చేయడానికి కొత్త టెక్నిక్ చూడండి..

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:15 AM

గృహిణులు తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ గిన్నెలను క్లీన్ చేయడానికి కొత్త టెక్నిక్ కనుగొంది.

Viral Jugaad Video: ఈ ఆంటీ తెలివికి ఫిదా కావాల్సిందే.. గిన్నెలను క్లీన్ చేయడానికి కొత్త టెక్నిక్ చూడండి..
Viral Jugaad Video

మన దేశంలో సామాన్య పౌరులు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోయినా క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనిపెడుతుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో గృహిణులు ముందుంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad videos) చాలా మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ గిన్నెలను (Dish Washing) క్లీన్ చేయడానికి కొత్త టెక్నిక్ కనుగొంది.


kismat191970 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ గిన్నెలను తోమడానికి వాషింగ్ మెషిన్‌ను (Waching machine) ఉపయోగిస్తోంది. సాధారణంగా వాషింగ్ మెషిన్‌ను బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ వీడియోలోని మహిళ వాషింగ్ మెషిన్ సహాయంతో గిన్నెలను క్లీన్ చేస్తోంది. వాషింగ్ మెషిన్‌లో గిన్నెలను వేసి, వాటిపై లిక్విడ్ వేసి మెషిన్ ఆన్ చేసింది. బట్టలను ఉతికినట్టే ఆ మెషిన్ గిన్నెలను కూడా క్లీన్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. 41 వేల మందికి పైగా ఆ వీడియోన లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ వాషింగ్ మెషిన్ ఎంతో కాలం పని చేయదని ఒకరు కామెంట్ చేశారు. వాషింగ్ మెషిన్‌ను ఇలా పాడు చేసే బదులు డిష్ వాషర్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అని మరొకరు సూచించారు. ఆ శబ్దం ఊరు మొత్తానికి వినబడుతుందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..

ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 09 , 2025 | 09:15 AM