ABN , First Publish Date - 2023-11-16T00:06:23+05:30 IST
వైసీపీ నయవంచన పాలనలో ఎస్సీ, ఎస్టీలు దగా పడ్డారని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వంగర మండలం కొండచాకారపల్లి, తల గాం గ్రామాలకు చెందిన 350 మంది వైసీపీ నాయకులు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విరక్తి చెంది టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆలోచించకపోవడం... చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా టీడీపీలో చేరినట్లు తెలిపారు. దళితులకు సంబంధించిన 27 పఽథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి మోహన్‌రావు, ఎల్.ధనలక్ష్మి, మజ్జి గణపతి, కృష్ణమూర్తి, బి .రవి, మురళీ వడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు.
రాజాం: వైసీపీ నయవంచన పాలనలో ఎస్సీ, ఎస్టీలు దగా పడ్డారని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వంగర మండలం కొండచాకారపల్లి, తల గాం గ్రామాలకు చెందిన 350 మంది వైసీపీ నాయకులు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విరక్తి చెంది టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆలోచించకపోవడం... చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా టీడీపీలో చేరినట్లు తెలిపారు. దళితులకు సంబంధించిన 27 పఽథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి మోహన్‌రావు, ఎల్.ధనలక్ష్మి, మజ్జి గణపతి, కృష్ణమూర్తి, బి .రవి, మురళీ వడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు.