National Anthem Video Goes Viral: సూపర్ బుల్లోడా.. ఈ పిల్లాడి దేశ భక్తి చూస్తే సెల్యూట్ చేస్తారు..
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:53 PM
క్లాస్ రూము వైపు నడుచుకుంటూ వెళుతున్నపుడు జాతీయ గీతం ఆలపించటం మొదలైంది. ఆ పిల్లాడు వెంటనే శిలగా మారినట్లు నిలబడి పోయాడు.
ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు పిల్లాడి దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. థాయ్‌లాండ్‌లోని స్కూళ్లలో ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు పిల్లలు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉంటారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో పిల్లలందరూ నిలబడి ఉండాలి. కొద్దిరోజుల క్రితం ఓ పిల్లాడు.
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడు. క్లాస్ రూము వైపు నడుచుకుంటూ వెళుతున్నపుడు జాతీయ గీతం ఆలపించటం మొదలైంది. ఆ పిల్లాడు వెంటనే శిలగా మారినట్లు నిలబడి పోయాడు. నడుస్తున్న ఫోజులో అలానే ఉండిపోయాడు. కొంచెం కూడా కదల్లేదు. పైన అంతస్తులో ఉన్న పిల్లలు కదులుతున్నా కూడా కిందున్న పిల్లాడు కదల్లేదు. జాతీయ గీతం అయిపోయే వరకు అలానే ఉండిపోయాడు. ఇక, వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘దేశ భక్తి అంటే ఇలాగే ఉండాలి. చిన్నతనం నుంచే దాన్ని అలవాటు చేయాలి’.. ‘దేశాన్ని ప్రేమించే వాడు ఎప్పటికైనా గొప్పస్థాయిలోకి వెళతాడు’..‘ఈ వీడియో చూసి చాలా మంది నేర్చుకోవాలి. కొంతమందికి దేశం మంటే మర్యాద కూడా ఉండదు’..‘దేశం మంటే మట్టి కాదోయ్.. దేశం మంటే మనుషులోయ్ అని ఊరికే అనలేదు. మనం దేశాన్ని ప్రేమిస్తేనే.. ఇతర దేశాల వాళ్లు మన దేశాన్ని ప్రేమిస్తారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నోయిడా మర్డర్ కేసులో ట్విస్ట్.. నిక్కీ వదిన సంచలన వ్యాఖ్యలు
మూసీ మాస్టర్ ప్లాన్‌పై చర్చ.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు