New Dowry Allegations Emerge: నోయిడా మర్డర్ కేసులో ట్విస్ట్.. నిక్కీ వదిన సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:15 PM
ఆ గొడవ పరిష్కారం కాలేదు. ఇంకా పంచాయతీలోనే ఉంది. నిక్కీ తండ్రి భికారీ సింగ్, మిగితా కుటుంబసభ్యులు ఆమెను కోడలిగా మళ్లీ అంగీకరించలేదు.
నోయిడాలో చోటుచేసుకున్న అదనపు కట్నం కోసం హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. నిక్కీ అన్న భార్య మీనాక్షి నిక్కీ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది. అత్తింటి వారు తనను అదనపు కట్నం కోసం వేధించారని ఆమె అంది. మీనాక్షి చెబుతున్న దాని ప్రకారం.. మీనాక్షికి, నిక్కీ అన్న రోహిత్ పాయలాకు 2016లో పెళ్లయింది. పెళ్లి సందర్భంగా మీనాక్షి కుటుంబసభ్యులు కట్నం కింద మారుతీ సుజికీ సియాజ్ ఇచ్చారు. అయితే, ఆ కారు అంతగా బాగోలేదని అత్తింటి వారు దాన్ని అమ్మేశారు.
స్కార్పియో ఎస్‌యూవీతో పాటు డబ్బులు కావాలని మీనాక్షిని అడిగారు. ఇందుకు మీనాక్షి ఒప్పుకోలేదు. దీంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. ఈ గొడవ కాస్తా పంచాయతీకి చేరింది. పంచాయతీ పెద్దలు మీనాక్షి కుటుంబానికి మద్దతుగా తీర్పునిచ్చారు. కట్నం, పెళ్లి కోసం చేసిన ఖర్చులతో కలిపి 35 లక్షలు మీనాక్షి కుటుంబానికి తిరిగి ఇవ్వాలని అన్నారు. అలా ఇస్తే ఆమె మరో పెళ్లి చేసుకుంటుందని చెప్పారు.
డబ్బులు ఇవ్వలేకపోతే అత్తింటికి తీసుకెళ్లాలని అన్నారు. అయితే, ఆ గొడవ పరిష్కారం కాలేదు. ఇంకా పంచాయతీలోనే ఉంది. నిక్కీ తండ్రి భికారీ సింగ్, మిగితా కుటుంబసభ్యులు ఆమెను కోడలిగా మళ్లీ అంగీకరించలేదు. ఈ విషయంపై మీడియా మీనాక్షి భర్తను నిలదీసింది. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ‘నేను ఆ విషయంపై మాట్లాడదల్చుకోలేదు. అవి కేవలం ఆరోపణలు మాత్రమే’ అని అన్నాడు. ఆ వెంటనే రోహిత్ బంధువు మాట్లాడుతూ.. ‘ఈ గొడవ రెండు కుటుంబాలు గన్నులతో కాల్చుకునే వరకు వెళ్లింది. ప్రతీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మేము మీనాక్షిని కాల్చి చంపలేదు కదా’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట..
నడిరోడ్డుపై ఆకతాయిల ఆగడాలు.. నడిరోడ్డుపై అమ్మాయిలను వెంబడించి..