Actress Lakshmi Menon Abduction Case: కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట..
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:41 PM
కొచ్చిలోని వెలాసిటీ పబ్‌కు ఓ టెకీ వెళ్లాడు. అక్కడ హీరోయిన్ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనామాల్‌తో అతడికి గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది.
ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు కేరళ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. కిడ్నాప్, దాడి కేసులో తన అరెస్ట్‌ను అడ్డుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీ మీనన్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఆమెకు మద్దతుగా తీర్పునిచ్చింది. లక్ష్మీ మీనన్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని జస్టిస్ బెచు కురియన్ తీర్పునిచ్చారు.
పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చే వరకు ఆగాలని పోలీసులను ఆదేశించారు. ఇక, ఈ కేసు విషయానికి వస్తే.. చెన్నైలోని అలువా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొచ్చిలో టెకీగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతడు తన స్నేహితుడితో కలిసి కొచ్చిలోని వెలాసిటీ పబ్‌కు వెళ్లాడు. అక్కడ హీరోయిన్ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనామాల్‌తో అతడికి గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీ మీనన్ గ్రూపు తనను, తన స్నేహితుడ్ని కిడ్నాప్ చేసి కొట్టిందని టెకీ అంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు గురించి తెలుసుకున్న లక్ష్మీ మీనన్ యాంటీస్పేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. తనపై పెట్టిన కేసు తప్పుడుదని, కావాలనే తనపై కేసు పెట్టారని ఆరోపించింది. తన పేరును దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన కోర్టు సెప్టెంబర్ 17వ తేదీ వరకు లక్ష్మీ మీనన్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
నడిరోడ్డుపై ఆకతాయిల ఆగడాలు.. నడిరోడ్డుపై అమ్మాయిలను వెంబడించి..
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం..