Living Alone: 3 ఏళ్లుగా ఇంట్లోనే.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ..
ABN , Publish Date - Jul 01 , 2025 | 07:59 AM
Living Alone: ఆ ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో పొరిగిళ్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపు కొట్టగా అనుప్ తలుపు తెరిచాడు. అతడ్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.
నవీ ముంబైలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ టెకీ మూడేళ్ల పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా బయటకు రాలేదు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవాడు. మూడేళ్లుగా ఇంటిని శుభ్రం చేయకపోవటంతో అది చెత్తకుప్పలా మారింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అనుప్ కుమార్ నాయర్ అనే వ్యక్తి గతంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే వాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంటికి పరిమితం అయ్యాడు.
అయితే, అనుప్ గత మూడేళ్లగా ఇంటినుంచి బయటకు రాలేదు. జుయ్ నగర్ ఇంట్లోనే తనను తాను బంధీ చేసుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ చేసుకున్నాడు. ఎవ్వరికీ ఫోన్ చేసే వాడు కాదు. ఎవ్వరినీ ఇంటికి రానిచ్చే వాడు కాదు. ఆకలి వేసినపుడు మాత్రం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినే వాడు. ఒంటరిగా ఆ ఇంట్లో ఏం చేసేవాడో తెలీదు కానీ.. బయటకు మాత్రం వచ్చేవాడు కాదు. మూడేళ్ల పాటు ఇంటిని శుభ్రం చేయకపోవటంతో అది డంప్ యార్డ్ లాగా మారిపోయింది. విపరీతమైన దుర్వాసన రావటం మొదలైంది.
ఆ ఇంటినుంచి కంపు వస్తుండటంతో పొరిగిళ్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపు కొట్టగా అనుప్ తలుపు తెరిచాడు. అతడ్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. గడ్డం, జుట్టు బాగా పెరిగిపోయి ఓ పిచ్చి వాడిలాగా ఉన్నాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి మరో సారి షాక్ అయ్యారు. ఇళ్లు డంప్ యార్డ్‌ను తలపించేలా విపరీతమైన చెత్తతో నిండి ఉంది. దీంతో అతడ్ని అక్కడినుంచి తరలించారు. జుట్టు, గడ్డం తీయించి స్నానం చేయించారు.
డిప్రెషన్ కారణంగానే ఇలా..
అనుప్ ఈ విధంగా అవ్వడానికి డిప్రెషన్ కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం అనుప్ సోదరుడు చనిపోయాడు. అప్పటినుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోనే విపరీతమైన డిప్రెషన్ కారణంగా ఇంటికే పరిమితం అయిపోయాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
వారికి మస్క్ వార్నింగ్.. అస్సలు వదలి పెట్టనంటూ..
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..