Share News

Elon Musk Warns Lawmakers: వారికి మస్క్ వార్నింగ్.. అస్సలు వదలి పెట్టనంటూ..

ABN , Publish Date - Jul 01 , 2025 | 07:29 AM

Elon Musk Warns Lawmakers: డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు మద్దతుగా నిలిచిన వారిని వదిలిపెట్టనని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారి అంతు తేలుస్తానని అన్నారు.

Elon Musk Warns Lawmakers: వారికి మస్క్ వార్నింగ్.. అస్సలు వదలి పెట్టనంటూ..
Elon Musk Warns Lawmakers

‘వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్’ పాస్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. జులై 4వ తేదీకి బిల్లుకు తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. అయితే, బిల్లు ఆమోదం పొందడానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌లో సహనం నశిస్తోంది. మళ్లీ బిల్లుపై విమర్శలు మొదలెట్టారు. వరుస ట్వీట్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్లుకు మద్దతుగా ఉన్న సెనేటర్లకు మస్క్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.


బిల్లుకు మద్దతుగా నిలిచిన వారిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారి అంతు తేలుస్తానని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. 'ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద రుణ పెంపుకు ఓటు వేసిన ప్రతీ కాంగ్రెస్ సభ్యుడూ తలదించుకోవాలి. వాళ్లను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తాను. ఇది నేను చేసే చివరి పని అయినా పరవాలేదు.' అని అన్నారు.


దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద భారం

ట్రంప్ తీసుకువస్తున్న ఈ బిల్లు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద భారం పడనుంది. ఈ బిల్లుతో సంక్షేమ పథకాలకు నిధులు తగ్గనున్నాయి. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. దేశ ఆర్థిక వ్యవస్థపై మరో మూడు ట్రిలియన్ డాలర్ల అప్పు భారం పడనుంది. ఈ బిల్లులో సరిహద్దులు, దేశ భద్రతకు ఏకంగా 350 బిలియన్ డాలర్లు కేటాయించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడను విస్తరించేందుకు 46 బిలియన్ డాలర్లు, వలసదారుల డిటెన్షన్ బెడ్స్ కోసం 45 బిలియన్ డాలర్లు, వలసల శాఖలో 10 వేల మంది సిబ్బంది నియామకం కోసం భారీగా నిధులను కేటాయించారు.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

5 వేల మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్‌

Updated Date - Jul 01 , 2025 | 01:46 PM