Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jul 01 , 2025 | 06:40 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,770 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,080 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారం అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారం అంటే ప్రాణం. ఎంత ఉన్నా ఇంకా కావాలని అంటారే తప్ప.. నో చెప్పరు. గత నెల ప్రారంభంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్షకు చేరింది. అయితే, జూన్ చివరకు వచ్చే సరికి ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 93 వేలకు పడిపోయింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,770 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,080 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,150 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
నగరంలో వెండి ధరలు ఇలా ..
మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు మాత్రం తగ్గలేదు. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,900 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,19,000 దగ్గర ట్రేడ్ అయింది. వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు కాబట్టి.. 100 గ్రాముల వెండి ధర 11,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,19,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
కొన్ని నెలల్లో ఇరాన్ అణు కార్యక్రమం మళ్లీ మొదలు
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం