Share News

కొన్ని నెలల్లో ఇరాన్‌ అణు కార్యక్రమం మళ్లీ మొదలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:48 AM

అమెరికా దాడుల వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమానికి వచ్చిన ముప్పు పెద్దగా ఏం లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) అధిపతి రఫేల్‌ గ్రాసీ పేర్కొన్నారు.

కొన్ని నెలల్లో ఇరాన్‌ అణు కార్యక్రమం మళ్లీ మొదలు

న్యూఢిల్లీ, జూన్‌ 30: అమెరికా దాడుల వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమానికి వచ్చిన ముప్పు పెద్దగా ఏం లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) అధిపతి రఫేల్‌ గ్రాసీ పేర్కొన్నారు. అమెరికా దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఇరాన్‌ మళ్లీ యురేనియాన్ని తనకు కావాల్సిన విధంగా శుద్ధి చేయగలదని వివరించారు. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం, ఆ దేశ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం.

Updated Date - Jul 01 , 2025 | 05:48 AM