Indian talent: ఇతడి ట్యాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే.. ఈ టేబుల్‌ను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు..
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:42 PM
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తాను తయారు చేసిన వినూత్నమైన టేబుల్‌ను చూపిస్తున్నాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (viral video).
ఆ వీడియోలో ఒక వ్యక్తి తాను తయారు చేసిన వినూత్నమైన టేబుల్‌ను చూపిస్తున్నాడు. ఆ టేబుల్ బయటకు చూడడానికి సాధారణంగానే కనబడుతోంది. కానీ, ఆ టేబుల్‌కు ఎన్నో సొరుగులు ఉన్నాయి. వాటన్నింటినీ ఎంతో చక్కగా, గొప్ప నైపుణ్యంతో కళాత్మకంగా అమర్చారు. ఆ టేబుల్ సోరుగులు వేయడానికి ఉపయోగించే తాళాలు కూడా వినూత్నంగా ఉన్నాయి. చూస్తుంటే అదేదో మాయ, మంత్రంలా కనిపిస్తోంది (super talent India).
ఆ వెరైటీ టేబుల్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (artistic skills). ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించి ఆ టేబుల్‌ను రూపొందించిన వ్యక్తి ట్యాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ టేబుల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉందని, దానిని ఉపయోగించేటపుడు మరింత థ్రిల్‌గా ఉంటుందేమోనని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె ఏం చేసిందంటే..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..