Stray Bull Throws Woman: మహిళపై ఎద్దు దాడి.. గాల్లోకి ఎత్తి పడేసింది..
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:15 AM
పాపం ఆ మహిళ పైకి లేయలేని పరిస్థితిలో రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంకిత్ ముత్రిజ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మనసు కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వీధి ఎద్దు మహిళపై దారుణానికి ఒడిగట్టింది. వెనకాలే వచ్చి గాల్లోకి ఎత్తుపడేసింది. ఈ శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీలోని బబిన గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. ఓ ఎద్దు ఆమెను వెంబడించింది. దీంతో ఆ మహిళ కర్రతో దాన్ని భయపెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.
ఆ ఎద్దు ఆమెను ఫాలో అవుతూ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ నిర్మానుషంగా ఉన్న ఇరుకైన సందులోకి వచ్చింది. ఎద్దు ఆమె వెనకాలే ఫాలో అయింది. మహిళ అప్పుడప్పుడు వెనకాలకు తిరిగి కర్రతో దాన్ని భయపెడుతూ ఉంది. అయితే, ఆటో దగ్గరకు రాగానే ఆ ఎద్దు ఆమెపై దాడి చేసింది. గాల్లోకి ఎత్తుపడేసింది. ఆ మహిళ గాల్లో పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి బైకుపై అటు వైపు వచ్చాడు. ఆ ఎద్దు అక్కడినుంచి పక్కకు కదల్లేదు. అటువైపు వచ్చిన బైకర్ వైపు కోపంగా చూసింది.
భయపడిపోయిన ఆ బైకర్ కొంచెం వెనక్కు తగ్గాడు. పాపం ఆ మహిళ పైకి లేయలేని పరిస్థితిలో రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంకిత్ ముత్రిజ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. జనం చనిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
ఎమ్‌జీబీఎస్‌లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..