Share News

Sounds from fridge: ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే వెళ్లి చూస్తే.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 28 , 2025 | 09:03 AM

ఇంట్లో అందరూ సరదాగా కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక వారందరూ అయోమయానికి గురయ్యారు. ఇళ్లంతా గాలించారు. చివరకు ఫ్రిడ్జ్ వెనుక చూస్తే అసలు విషయం బయటపడింది.

Sounds from fridge: ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే వెళ్లి చూస్తే.. ఏం జరిగిందంటే..
Fridge

ఇంట్లో అందరూ సరదాగా కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాక వారందరూ అయోమయానికి గురయ్యారు. ఇళ్లంతా గాలించారు. చివరకు ఫ్రిడ్జ్ (Fridge) వెనుక చూస్తే అసలు విషయం బయటపడింది. ఆ ఫ్రిడ్జ్ వెనుక ఉన్న విషసర్పాన్ని (Snake) చూసి వారందరూ నివ్వెరపోయారు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు. అది మనదేశంలోనే అత్యంత విషపూరిత సర్పమని ఆ వ్యక్తి తెలియజేశాడు.


adilmirzasnake అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అత్యంత విషపూరితమైన కామన్ క్రైట్ (Common Krait) సర్పం దాక్కుని ఉంది. ఆ పాము చేసే శబ్దాలు విని కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. చివరకు తమ ఇంటి ఫ్రిడ్జ్‌లోనే ఆ పాము ఉందని తెలుసుకుని షాకయ్యారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి ఆదిల్ మీర్జా‌కు ఫోన్ చేశారు. అతడు వెంటనే అక్కడకు చేరుకున్నాడు. ఆ పామును పట్టే ప్రాసెస్ మొత్తాన్ని రికార్డు చేశాడు.


ఈ పాము రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో ఎలా చుట్టుకుని ఉందో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాము భారతదేశంలోనే అత్యంత విషపూరితమైన పామైన కామన్ క్రైట్‌ అని అదిల్ మీర్జా తెలిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వైరల్ వీడియోను ఏడు లక్షల మందికి పైగా వీక్షించగా.. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ వ్యక్తి సూచించారు.


ఇవి కూడా చదవండి..

ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..

వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..

వామ్మో.. ఈ కుర్రాడు నిజంగా మనిషేనా.. వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ఏం చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 28 , 2025 | 12:36 PM