Social Media Influencers: ఆటో డ్రైవర్‌తో లేడీ యూట్యూబర్ల గొడవ.. నడిరోడ్డులో ..
ABN , Publish Date - Nov 05 , 2025 | 09:25 PM
ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఆటో డ్రైవర్‌తో గొడవ పెట్టుకుని, అతడిపై దాడికి సైతం దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నడిరోడ్డుపై యూట్యూబర్ అక్కాచెల్లెళ్లు రెచ్చిపోయారు. ఆటో డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. అతడిపై అందరూ చూస్తుండగానే దాడి చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్‌కు చెందిన మెహక్, పరి యూట్యూబ్‌లో ఓ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇద్దరూ కలిసి వీడియోలు చేస్తూ స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో కూడా వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే, ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకరమైన వీడియోలు చేస్తూ ఉన్నారు. జనం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయినా వీరు మాత్రం అలాంటి కంటెంట్ చేయటం ఆపలేదు. అభ్యంతరకరమైన కంటెంట్ చేస్తూ ఓ సారి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. మెహక్, పరిలు తరచుగా ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిన జాతరలో అక్కాచెల్లెళ్లు రచ్చ రచ్చ చేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సైతం అప్పట్లో వైరల్‌గా మారింది.
ఇప్పుడు మరో సారి గొడవతో అక్కాచెల్లెళ్లు వైరల్ అయ్యారు. ఈ సారి ఓ ఆటో డ్రైవర్‌తో ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు. మొరాదాబాద్‌లోని ఢిల్లీ రోడ్డులో ఈ గొడవ జరిగింది. ఇద్దరూ కలిసి ఆటో డ్రైవర్‌పై దాడికి సైతం దిగారు. ఈ గొడవ ఎందుకు జరిగిందన్నది తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన 36 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ అక్కాచెల్లెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు
ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..