PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 09:19 PM
భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచ కప్ సాధించి చర్రిత సృష్టించింది. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచింది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఢిల్లీ: భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచ కప్ సాధించి చర్రిత సృష్టించింది. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచింది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా జట్టును ప్రధాని అభినందించారు (PM Modi meeting).
52 సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టును ప్రధాని మోదీ అభినందించారు. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత అమోఘంగా పుంజుకుని టైటిల్‌ను సాధించడాన్ని ప్రధాని ప్రశంసించారు. భారత క్రికెట్ చరిత్రలో ఇది గొప్ప విజయం అని అభివర్ణించారు. జట్టులోని ఒక్కో సభ్యురాలితో ప్రధాని ముచ్చటించారు. ఆటకు సంబంధించి పలు విషయాల గురించి వారితో చర్చించారు (Indian womens team).
ఈ సందర్భంగా ప్రధానికి జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 'నమో' అని ఉన్న జెర్సీని అందజేశారు (World Cup winners). ఇక, ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని క్రికెటర్లను ప్రధాని కోరారు. పెరుగుతున్న ఊబకాయం సమస్య గురించి ఆయన చర్చించారు. పాఠశాలలకు వెళ్లి అక్కడి యువతను ప్రోత్సహించాలని సూచించారు. కాగా, అంతకు ముందు ఢిల్లీ చేరుకున్న మహిళా జట్టుకు హోటల్‌లో డ్రమ్స్, పూలతో ఘన స్వాగతం లభించింది. ప్లేయర్లు, కోచ్ అమోల్ మజుందార్ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి