Share News

Snake waterfall: వామ్మో.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఆ జలపాతం దగ్గర రాళ్లను చూస్తే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:25 PM

ఇండోనేసియాలోని ఒక జలపాతం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ వీడియో ఓ జలపాతానికి సంబంధించినది. దానిని స్నేక్ వాటర్‌ఫాల్ అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్లడానికి కాస్త ధైర్యం కావాల్సిందే. ఆ వాటర్‌ఫాల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Snake waterfall: వామ్మో.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఆ జలపాతం దగ్గర రాళ్లను చూస్తే..
Snake waterfall

ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విడ్డూరాలతో నిండి ఉంది. తాజాగా ఇండోనేసియా (Indonesia)లోని ఒక జలపాతం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ వీడియో ఓ జలపాతానికి (waterfall) సంబంధించినది. దానిని స్నేక్ వాటర్‌ఫాల్ (Snake waterfall) అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్లడానికి కాస్త ధైర్యం కావాల్సిందే. ఆ వాటర్‌ఫాల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.


వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)ను ఇండోనేషియాలోని బాలిలో చిత్రీకరించారు. వీడియోలో కనిపిస్తున్న జలపాతాన్ని బేజీ గ్రియా వాటర్‌ఫాల్ అంటారు. ఇది ఉబుద్‌కు సమీపంలో ఉన్న పుంగ్‌గుల్ ప్రాంతంలో ఉంది. 2022 నుంచి ఈ జలపాతం దగ్గరకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. అద్భుతమైన అందం, విచిత్రమైన నిర్మాణం కారణంగా ఈ వాటర్‌ఫాల్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ జలపాతం దగ్గర రాళ్లు పాములు, అనకొండల ఆకృతిలో ఉండి భయపెడుతుంటాయి. నిజానికి ఈ జలపాతం దగ్గర ఉన్న రాళ్లు సహజమైనవి కావు.


ఈ జలపాతం దగ్గర పాములు, కొండచిలువల రూపంలో ఉన్న రాళ్లు స్థానిక కళాకారులు తయారు చేసిన శిల్పాలు. ఆ రాళ్లపై నాచు, ఆల్గే పేరుకుపోవడం వల్ల, అవి పురాతన శిథిలాల వలె కనిపిస్తాయి. పెద్ద పెద్ద పాములు ఆ జలపాతం దగ్గర ఉన్నట్టు భ్రమను కలిగిస్తాయి. అందుకే దీనిని స్నేక్ వాటర్ ఫాల్ అని పిలుస్తారు. ఈ శిల్పాలు బాలి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఇక్కడ స్నానం చేయడాన్ని స్థానికులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..

వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2025 | 08:25 PM