Passenger Harassed At Railway Station: రెండు సమోసాల కోసం మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:27 AM
యువకుడు సమోసాలు కొనకుండానే అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమోసాల వ్యాపారి యువకుడ్ని అడ్డగించాడు. టీషర్ట్ పట్టుకుని సమోసాల బుట్ట దగ్గరకు లాక్కు వచ్చాడు.
ఉత్తర భారత దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇందుకు ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రైల్వే స్టేషన్‌లో సమోసాల వ్యాపారి ఓ ప్రయాణికుడితో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. రెండు సమోసాల కోసం ప్రయాణికుడి వాచీ తీసేసుకున్నాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు జబల్‌పూర్ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఆగటంతో కిందకు దిగాడు. ప్లాట్ ఫామ్ మీద సమోసాలు కనిపించటంతో రెండు ఆర్డర్ చేశాడు.
షాపు అతను పేపర్ ప్లేట్‌లో వాటిని ఉంచి సిద్ధం చేశాడు. యువకుడు ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, టెక్నికల్ కారణాల వల్ల పేమెంట్ అవ్వలేదు. అదే సమయంలో రైలు కదలటంతో యువకుడు సమోసాలు కొనకుండానే అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమోసాల వ్యాపారి యువకుడ్ని అడ్డగించాడు. టీషర్ట్ పట్టుకుని సమోసాల బుట్ట దగ్గరకు లాక్కు వచ్చాడు. ఆన్‌లైన్ పేమెంట్ అవ్వటం లేదని, తన దగ్గర చిల్లర లేదని యువకుడు ఎంత చెప్పినా వినలేదు. పేమెంట్ చేసి సమోసాలు తీసుకెళ్లాల్సిందే అని పట్టుబట్టాడు.
ఆ యువకుడు మరోసారి ప్రయత్నించాడు. రెండో సారి కూడా పేమెంట్ అవ్వలేదు. రైలు వెళ్లిపోతుండటంతో ఆ తనను వదిలిపెట్టమని బ్రతిమాలాడు. అయినా కూడా ఆ వ్యాపారి వదిలిపెట్టలేదు. స్మార్ట్ వాచీ ఇచ్చి సమోసాలు తీసుకెళ్లమన్నాడు. ఆ యువకుడు చేసేదీ ఏమీ లేక రెండు సమోసాల కోసం స్మార్ట్ వాచీని ఇచ్చేశాడు. అప్పుడు కానీ, ఆ వ్యాపారి అతడ్ని వదిలిపెట్టలేదు. ఆ యువకుడు రెండు సమోసాలను రెండు చేతుల్లో పట్టుకుని రైలు ఎక్కటం కోసం పరుగులు తీశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇవాళే నరక చతుర్దశి.. ఉదయాన్నే ఇలా చేయండి!
ప్రేమ పేరుతో హనీ ట్రాప్.. ప్రియురాలి మోసం భరించలేక..