Patient Walks Out Drinks Liquor: గాయాలకు కట్లు, చేతిలో యూరిన్ బ్యాగ్‌తో వైన్ షాపు దగ్గరకు..
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:19 PM
విపిన్ నడవలేని స్థితిలో ఉండటంతో యూరిన్ బ్యాగ్ పెట్టారు. రెండు రోజుల్లో అతడు కొద్దిగా కోలుకున్నాడు. నడవటానికి శక్తి రాగానే నేరుగా వైన్ షాపు దగ్గరకు వెళ్లిపోయాడు. మందు ఆర్డర్ చేసుకుని అక్కడే తాగేశాడు.
మద్యానికి బానిస అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఓ వ్యక్తి మందును మాత్రం వదలలేకపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన అతడు ఎవ్వరూ ఊహించని పని చేశాడు. గాయాలకు కట్టిన కట్లతో, యూరిన్ బ్యాగుతో నేరుగా ఆస్పత్రినుంచి(Patient Walks Out Hospital) వైన్ షాపు దగ్గరకు వెళ్లిపోయాడు. బాగా మందు తాగి రోడ్డుపై పడిపోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షహనాజ్‌పూర్‌కు చెందిన విపిన్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం యాక్సిడెంట్‌కు గురయ్యాడు.
తలకు, ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడ్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు అతడి గాయాలకు కట్లు కట్టారు. విపిన్ నడవలేని స్థితిలో ఉండటంతో యూరిన్ బ్యాగ్ పెట్టారు. రెండు రోజుల్లో అతడు కొద్దిగా కోలుకున్నాడు. నడవటానికి శక్తి రాగానే నేరుగా వైన్ షాపు దగ్గరకు వెళ్లిపోయాడు. మందు ఆర్డర్ చేసుకుని అక్కడే తాగేశాడు. శరీరానికి కట్లు, యూరిన్ బ్యాగుతో(Urine Bag Patient Viral Hospital Clip) మందు షాపు దగ్గరకు వచ్చిన అతడ్ని చూసి తోటి మందు బాబులు ఆశ్చర్యపోయారు.
విపిన్ మందు తాగిన కొద్దిసేపటికే కిందపడిపోయాడు. స్థానికులు మళ్లీ అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై విపిన్ తల్లి మాట్లాడుతూ.. ‘తలకు గాయం తగలటం వల్ల నా కొడుకు మెదడు సరిగా పని చేయటం లేదు’ అని చెప్పుకొచ్చింది. ఇక, విపిన్ మందు షాపు దగ్గరకు వచ్చిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపల్ దృష్టికి కూడా వెళ్లింది. ఆయన మాట్లాడుతూ.. ‘వీడియో మా దృష్టికి వచ్చింది. సిబ్బంది దాటుకుని ఆ పేషంట్ ఎలా బయటకు వెళ్లాడన్న(Hospital Negligence Uttar Pradesh Video) దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
సీక్రెట్‌గా వీడియోలు తీసిన ప్రియుడు.. పక్కా ప్లాన్‌తో..