Share News

Timarpur UPSC Aspirant: సీక్రెట్‌గా వీడియోలు తీసిన ప్రియుడు.. పక్కా ప్లాన్‌తో..

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:25 PM

రమేష్‌కు కొన్ని నెలల క్రితం 21 ఏళ్ల అమ్రితతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గాంధీ విహార్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం మొదలెట్టారు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రమేష్ సీక్రెట్‌గా వీడియోలు తీశాడు.

Timarpur UPSC Aspirant: సీక్రెట్‌గా వీడియోలు తీసిన ప్రియుడు.. పక్కా ప్లాన్‌తో..
Timarpur UPSC Aspirant

ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల రమేష్ కేశ్ మీనా అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా చనిపోలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియురాలే పక్కా ప్లాన్‌తో అతడ్ని మర్డర్ చేయించినట్లు వెల్లడైంది. రమేష్ దగ్గర ఉన్న తన ప్రైవేట్ వీడియోల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్‌కు చెందిన రమేష్ యూపీఎస్సీకి(Timarpur UPSC Aspirant) ప్రిపేర్ అవుతున్నాడు.


కొన్ని నెలల క్రితం అతడికి 21 ఏళ్ల అమ్రితతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గాంధీ విహార్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం మొదలెట్టారు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రమేష్ సీక్రెట్‌గా వీడియోలు(Private Video Blackmail) తీశాడు. వాటిని హార్డ్ డిస్క్‌లో దాచి పెట్టాడు. ఈ విషయం అమ్రితకు తెలిసింది. రమేష్‌ను నిలదీసింది. వీడియోలు డిలీట్ చేయాలని కోరింది. అతడు ఇందుకు ఒప్పుకోలేదు. అమ్రిత ఎంత బతిమాలినా కూడా రమేష్ మనసు కరగలేదు. దీంతో ఈ విషయాన్ని అమిత్ర తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్‌కు చెప్పింది.


అమ్రిత చెప్పింది విని సుమిత్ కోపం కట్టలు తెంచుకుంది. ఇద్దరూ కలిసి రమేష్‌ను మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పక్కాప్లాన్ వేశారు. సుమిత్ తన స్నేహితుడు సందీప్ కుమార్ సాయం తీసుకున్నాడు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి సుమిత్, సందీప్.. రమేష్‌ ఫ్లాట్‌కు వెళ్లారు. అతడ్ని కొట్టి, గొంతు నులిమి చంపేశారు. తర్వాత మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. సుమిత్ గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి రమేష్ తల దగ్గర పెట్టాడు. సిగరెట్లు కాల్చే లైటర్ అంటించి డెడ్ బాడీకి కొద్దిదూరంలో పెట్టాడు. రమేష్‌కు సంబంధించిన రెండు ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లు తీసుకుని ఇద్దరూ అక్కడినుంచి బయటకు వచ్చేశారు. (Live-In Partner Delhi)


గంట తర్వాత సిలిండర్ నుంచి లీక్ అయిన గ్యాస్ ఆ లైటర్‌ను తాక గానే బ్లాస్ట్ జరిగింది. ఇళ్లు మొత్తం కాలిపోయింది(Delhi Charred Body Case). పోలీసులు మొదట దీన్ని అగ్నిప్రమాదం అనుకున్నారు. అయితే, రమేష్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయటంతో .. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీన అమ్రితను అరెస్ట్ చేసి విచారించారు. అసలు విషయం బయటపడింది. మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

సీజేఐపై దాడి చేసిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీం నిరాకరణ

విషాదం.. టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి

Updated Date - Oct 27 , 2025 | 04:31 PM