Share News

Telangana: విషాదం.. టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి

ABN , Publish Date - Oct 27 , 2025 | 03:52 PM

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ తండాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న ఇంట్లో బ్రష్ చేసుకుంటుండగా చిన్నారి మానస(3)కు ఎలుకల మందు కనిపించింది. పేస్ట్ తినే అలవాటు ఉండటంతో ఆ ఎలుకల మందుని పేస్ట్ అనుకొని తినేసింది.

Telangana: విషాదం.. టూత్‌పేస్ట్ అనుకొని ఎలుకల మందు తిని చిన్నారి మృతి
Child dies after consuming rat poison

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ తండాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న ఇంట్లో బ్రష్ చేసుకుంటుండగా చిన్నారి మానస(3)కు ఎలుకల మందు కనిపించింది. పేస్ట్ తినే అలవాటు ఉండటంతో ఆ ఎలుకల మందుని పేస్ట్ అనుకొని తినేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి చిన్నారిని వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి చిన్నారిని తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..

Cyclone Montha in Telangana: మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు

Updated Date - Oct 27 , 2025 | 09:50 PM