Man slips from train: రెప్పపాటులో తప్పించుకున్న వ్యక్తి.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్..
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:22 PM
రైలు ప్రయాణ సమయంలో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. డోర్‌ల దగ్గర నిల్చుని ప్రయాణం చేయడం, కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం వంటి ప్రాణాంతక పనులు చేస్తుంటారు. ఇలాంటి సాహసాలు చేయడంలో యువకులే కాదు.. వృద్ధులు కూడా వెనకడుగు వేయడం లేదు.
రైలు ప్రయాణ సమయంలో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. డోర్‌ల దగ్గర నిల్చుని ప్రయాణం చేయడం, కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం వంటి ప్రాణాంతక పనులు చేస్తుంటారు. ఇలాంటి సాహసాలు చేయడంలో యువకులే కాదు.. వృద్ధులు కూడా వెనకడుగు వేయడం లేదు. తాజాగా బెలగావి రైల్వే స్టేషన్‌లో జరిగిన షాకింగ్ ఘటన చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (RPF constable saves man).
బెలగావి రైల్వే స్టేషన్‌లో రైలు నెమ్మదిగా కదులుతోంది. ఆ సమయంలో ఒక వృద్ధుడు రైలు దిగేందుకు ప్రయత్నించాడు. రైలు నుంచి ప్లాట్‌ఫామ్ మీదకు దూకాలనుకున్నాడు. అయితే అతడు అదుపు తప్పాడు. కాలు జారిపోయి రైలు కింద పడబోయాడు. అక్కడే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. ఆ వ్యక్తి రైలు కిందకు జారి వెళ్లిపోకుండా పట్టుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు (Belagavi train rescue).
ఆ ఘటన రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది (heroic act India). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. రైలు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇది వరకు కూడా కొందరు వ్యక్తులు ఇదే తరహాలో ప్రమాదాలకు గురైన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..