Viral Video: ఇన్ని రోజులు విన్నది తెలుగమ్మాయి వాయిసా.. ఏఐ అనుకున్నాం..
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:58 PM
సాధారణంగా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు, మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చని వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ విన్న అనేక మంది ఏఐ అనుకున్నారు. కానీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం మన తెలుగమ్మాయే. దీని గురించి ఆమె ఏం చెప్పిందో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు పలు సందర్భాలలో సోషల్ మీడియా, తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్‌ను ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చనే వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ప్రతి ఫోన్ కాల్ కాకపోయినా, పలు సందర్భాలలో మాత్రం మీకు ముందుగా వినిపించే వాయిస్ ఓవర్ ఇది. అయితే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది, ఏఐ అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ వాయిస్ నాదేనని ఓ తెలుగమ్మాయి తన అనుభవాన్ని పంచుకుంటూ ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మేము మీ వాయిస్ విన్నామని ఒకరు, వామ్మో ఇక చాలు తల్లి అని ఇంకొకరు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. వీడియోలో యువతి ప్రస్తుతం తన వాయిస్ తనకే ఇరిటేటింగ్‌గా అనిపిస్తున్నట్లు తెలిపింది. కొన్ని రోజుల క్రితం తన వాయిస్ బాగుందన్న పేరెంట్స్, ఇప్పుడు ఏంటి ఈ గోళ అంటున్నారని వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఏం చేస్తాం, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు కదా అని ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా ఈ యువతి చెప్పినట్లుగా సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి చిట్కాలు మాత్రం చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఎందుకంటే తెలియని వారిని నమ్మి పెట్టుబడులు చేసి, ఇప్పటికే అనేక మంది మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో పలువురు మన తెలుగమ్మాయి చెప్పిన వాయిస్ ఓవర్‌ను మెచ్చుకుంటున్నారు. బాగుందని, మీరు ఇంకా ఇలాగే మరిన్ని వాయిస్ ఓవర్లు చేయాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఆమె వాయిస్ ఎలా ఉందో ఈ వీడియో క్లిక్ చేసి మీరు కూడా చూసేయండి మరి.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ చూపు షార్ప్ అయితే.. ఈ పిల్లుల మధ్యనున్న ఎలుకను 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి