Rarely Plant: నిజమండీ.. ఒక మొక్కకు మూడు కూరగాయలు.!
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:26 AM
మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కూరగాయల మొక్కలను చూస్తుంటాం. మరెన్నో రంగురంగుల పూల చెట్లూ తారసపడుతుంటాయ్. కానీ ఈ అరుదైన కూరగాయల మొక్కను ఎప్పుడైనా చూశారా? ఇంతకీ ఈ చిత్రవిచిత్ర మొక్క ఎక్కడుంది.? దాని విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ కథనం చదవాల్సిందే..
ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రజ్యోతి: మనం నిత్యం ఆరుబయట పలురకాల మొక్కలు చూస్తుంటాం. ఒకే చెట్టుకు వివిధ రంగుల పూలు పూయడం, వాటి పత్రాలు వివిధ వర్ణాలలో ఉండటమూ గమనించే ఉంటాం. కానీ, ఓ అరుదైన జాతి మొక్క మాత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'సోలనేతి' జాతికి చెందిన ఈ చెట్టుకు ఏకంగా.. టమోట, వంగ, మిరప వంటి మూడు రకాల కూరగాయలు కాయడంతో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ఈ వింతైన మొక్కను చూసేందుకు జనాలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఎలా సాధ్యమైందంటే.?
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఎం.రజితా రమేశ్ అనే ఓ సాగుదారుడు.. తన పొలంలో ఈ మొక్కను పెంచారు. దీనిపై స్థానిక ఉద్యానశాఖ అధికారి స్పందిస్తూ.. మొక్కలోని జన్యుపరమైన మార్పుల వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. వాటికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించడం వల్లే ఇలా సాధ్యమైందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ముల్లు తీసేందుకు తంటాలు పడుతున్నారా.. ఈ ట్రిక్ తెలిస్తే అవాక్కవుతారు..
ఈ వరుడు మరీ ఫాస్ట్‌గా ఉన్నాడుగా.. కెమెరామెన్‌కు ఎలా షాకిచ్చాడంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి