Share News

Rajinikanth Superfan: రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:28 AM

ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.

Rajinikanth Superfan: రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..
Rajinikanth Superfan

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలైవాకు ప్రపంచం నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్‌కు రజినీ అంటే పిచ్చి అభిమానం. ఆయన కోసం ఏదైనా చేసేస్తారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ఫ్యాన్ తన అభిమాన హీరో రజినీకాంత్ కోసం కొన్నేళ్ల క్రితం గుడి కట్టాడు. రజినీ విగ్రహానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు నవరాత్రి సందర్భంగా ఏకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజినీకాంత్ అంటే చిన్నప్పటినుంచి పిచ్చి అభిమానం. అతడు పెరిగేకొద్దీ అభిమానం పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఓ వినూత్న పనికి తెరతీశాడు. కొన్ని నెలల క్రితం తలైవా కోసం ఓ చిన్న గుడిని నిర్మించాడు. అందులో రజినీ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. అయితే, ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశాడు. నవరాత్రి సందర్భంగా రజినీ గుడిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు.


ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి. ఇక, నవరాత్రి సందర్భంగా కార్తీక్ ప్రతీ రోజూ ఆ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేయనున్నాడు. ప్రస్తుతం తలైవా గుడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రజినీ విగ్రహం, ఫొటోలకు కార్తీక్ హారతి ఇస్తూ ఉన్నాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కార్తీక్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తలైవా ఫ్యాన్స్ గ్రేట్ అంటున్నారు.


ఇవి కూడా చదవండి

తిమింగలం వాంతితో పట్టుబడ్డ రైతు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

టాయిలెట్ సీటులో నల్ల త్రాచు.. చూడకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి..

Updated Date - Sep 21 , 2025 | 11:39 AM