Share News

5 Foot Black Cobra: టాయిలెట్ సీటులో నల్ల త్రాచు.. చూడకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి..

ABN , Publish Date - Sep 21 , 2025 | 09:48 AM

కోబ్రా టీమ్ వచ్చే వరకు పాము అక్కడినుంచి వెళ్లిపోలేదు. టాయిలెట్ కమోడ్‌లోనే కూర్చుండిపోయింది. కోబ్రా టీమ్ సభ్యులు పామును పట్టుకెళ్లిపోయారు.

5 Foot Black Cobra:  టాయిలెట్ సీటులో నల్ల త్రాచు.. చూడకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి..
5 Foot Black Cobra

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద పెరిగిపోతుంది. పాములు చల్లటి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటూ ఉంటాయి. ఆఖరికి షూలు, హెల్మెట్‌లలో కూడా దాక్కుంటూ ఉంటాయి. పాము కాట్ల కారణంగా దేశ వ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. వందల మంది ఆస్పత్రిపాలవుతున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది.


వాష్‌రూమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తృటిలో పాము కాటునుంచి తప్పించుకున్నాడు. ఏకంగా టాయిలెట్ కమోడ్‌లో త్రాచు పాము దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి అజ్మీర్ జిల్లాలోని ఆధ్మాత్మిక క్షేత్రం పుష్కర్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కుటుంబం మొత్తం ఓ హోటల్ గదిలో బస చేసింది. కుటుంబంలోని ఓ వ్యక్తి వాష్ రూమ్ వెళ్లాడు. లోపల టాయిలెట్ కమోడ్‌లో బుసలు కొడుతూ త్రాచుపాము కనిపించింది.


దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే మిగిలిన కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. వారు హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హోటల్ సిబ్బంది రాజస్థాన్ కోబ్రా టీమ్‌ను అక్కడికి పిలిపించారు. కోబ్రా టీమ్ వచ్చే వరకు పాము అక్కడినుంచి వెళ్లిపోలేదు. టాయిలెట్ కమోడ్‌లోనే కూర్చుండిపోయింది. కోబ్రా టీమ్ సభ్యులు పామును పట్టుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. తెల్లటి వెస్ట్రన్ కమోడ్‌లో నల్లటి త్రాచుపాము బుసలు కొడుతూ ఉంది.


ఇవి కూడా చదవండి

ఇండియన్ జర్నలిస్ట్‌తో ట్రంప్ దురుసు ప్రవర్తన?

పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

Updated Date - Sep 21 , 2025 | 10:00 AM