Alarm Clocks And Heart Health: పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:23 AM
అలారం ఓ బ్యాకప్‌లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి.
పొద్దున్నే ఓ నిర్దిష్టమైన సమయానికి లేవడానికి చాలా మంది అలారం పెడుతూ ఉంటారు. అలారం పెట్టుకునే వారు రెండు రకాలు. మొదటి రకంలో పొద్దున్నే లేచి ఆ రోజు మొత్తాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. రెండో రకంలో తప్పని సరిగా పొద్దున్నే లేవాలి కాబట్టి అలారం పెట్టుకుంటూ ఉంటారు. వీరిలో చాలా మంది అలారం మోగిన తర్వాత కూడా నిద్ర లేవరు. అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుండిపోతూ ఉంటారు.
అలారం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ..
పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజూ అలారం పెట్టుకుని నిద్రలేవటం వల్ల అది మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. న్యూరాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. అలారం వల్ల గాఢ నిద్ర దెబ్బ తింటుంది. బలవంతంగా గాఢ నిద్రలోంచి బయటకు రావాల్సి వస్తుంది. ఇలా సడెన్‌గా నిద్రలోంచి లేవటం వల్ల ‘స్లీప్ ఇనెర్టియా’ ఏర్పడుంది.
పెద్ద శబ్ధంతో అలారం పెట్టుకుని నిద్రలేవటం వల్ల కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె వేగంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అలారం పెట్టుకుని సడెన్‌గా నిద్రలోంచి లేవటం అన్నది శరీరానికి షాక్ ఇవ్వటం లాంటిది. అలారం ఓ బ్యాకప్‌లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే లేవడానికి అలారం వాడకపోవటం ఉత్తమం. ఎంతో అవసరం అయితేనే అలారం జోలికి వెళ్లాలి. మనంతట మనమే పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి
క్యాప్స్ గోల్డ్ కేసులో.. కైసా జువెలర్స్ సీజ్