Did Trump Critique Indian Journalist: ఇండియన్ జర్నలిస్ట్‌తో ట్రంప్ దురుసు ప్రవర్తన?
ABN , Publish Date - Sep 21 , 2025 | 08:26 AM
ఆ ప్రశ్న ఆయనకు నిజంగానే అర్థం కాలేదో లేక కావాలని అన్నారో తెలీదు కానీ.. ‘నువ్వు మరింత స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది. నాకేం అర్థం కాలేదు. ఇంకోసారి అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారతీయ సంతతికి చెందిన ఓ లేడీ జర్నలిస్ట్‌తో ట్రంప్ దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మీడియా బ్రీఫింగ్ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన లేడీ జర్నలిస్ట్ ట్రంప్‌ను హెచ్ 1బీ వీసాలకు సంబంధించి ఓ ప్రశ్న అడిగింది.
ఆ ప్రశ్న ఆయనకు నిజంగానే అర్థం కాలేదో లేక కావాలని అన్నారో తెలీదు కానీ.. ‘నువ్వు మరింత స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది. నాకేం అర్థం కాలేదు. ఇంకోసారి అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆమె మళ్లీ ప్రశ్న అడిగింది. ఈ సారి అందరికీ అర్థమయ్యేలా ప్రశ్న అడిగింది. అయినా కూడా ట్రంప్ ఏమీ అర్థంకానట్లు ముఖం పెట్టారు. ‘బిగ్ ట్యాక్స్.. ఏంటి?’ అంటూ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దీంతో కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్‌నిక్ రంగంలోకి దిగారు.
‘బిగ్ టెక్, బిగ్ టెక్ కంపెనీలు’ అంటూ ట్రంప్‌కు వివరించారు. గతంలోనూ ఓ ఇండియన్ జర్నలిస్ట్‌తో ట్రంప్ ఇలాగే ప్రవర్తించారు. ఫిబ్రవరి నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ట్రంప్‌తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఇండియన్ జర్నలిస్ట్ ట్రంప్‌ను ఓ ప్రశ్న అడగ్గా..‘నువ్వు ఏం మాట్లాడావో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న ఇండియన్ నెటిజన్లు ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. అయితే, ఆ ప్రశ్న అడిగిన లేడీ జర్నలిస్ట్ భారతీయ సంతతి మహిళా? కాదా? అన్నదానిపై క్లారిటీ లేదు. నేషనల్, ఇంటర్‌నేషనల్ మీడియాలో మాత్రం భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ అన్న ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త..
తప్పించుకోవాలనుకుంది.. వెంటాడి మరీ కాల్చి చంపాడు..