Farmer Arrested with Ambergris: తిమింగలం వాంతితో పట్టుబడ్డ రైతు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:38 AM
‘ది స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ సూరత్’ అధికారులు పక్కా సమాచారంతో విపుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 కిలోల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్పెర్మ్ వేల్ వాంతికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంబర్‌గ్రిస్ అని పిలిచే తిమింగలం వాంతిని ఖరీదైన పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతూ ఉంటారు. కేజీ తిమింగలం వాంతి కోట్ల రూపాయల ధర పలుకుతుంది. అందుకే తిమింగలం వాంతి స్మగ్లింగ్‌కు గురి అవుతూ ఉంటుంది. తాజాగా, ఓ రైతు కోట్లు విలువ చేసే తిమింగలం వాంతిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కోటీశ్వరుడు కావాలన్న కోరిక నెరవేరకుండానే జైలు పాలయ్యాడు.
ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భావ్‌నగర్ జిల్లా, హతబ్ గ్రామానికి చెందిన విపుల్ భూపత్‌భాయ్ బంబానియా అనే రైతుకు నాలుగు నెలల క్రితం బీచులో తిమింగలం వాంతి దొరికింది. అది అత్యంత ఖరీదైన అంబర్‌గ్రిస్ అని అతడు గుర్తించాడు. దాన్ని స్థానికంగా అమ్మే ప్రయత్నం చేశాడు. అయితే, దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో తిమింగలం వాంతితో సూరత్ చేరుకున్నాడు.
దాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ‘ది స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ సూరత్’ అధికారులు పక్కా సమాచారంతో విపుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 కిలోల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 5 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కింద అంబర్‌గ్రిస్‌ను అమ్మటం లేదా కొనడం చట్టరీత్యా నేరం. అంబర్‌గ్రిస్‌తో పట్టుబడితే జైలు శిక్ష తప్పదు.
ఇవి కూడా చదవండి
స్నేహితుడి ఇంటికి కన్నం.. ఆడ వేషంలో డబ్బులు, నగదు స్వాహా
టాయిలెట్ సీటులో నల్ల త్రాచు.. చూడకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి..