Share News

Viral News: భారతదేశంలో కుమార్తెలను పెంచడం అంత ఈజీ కాదు.. ఒక విప్లవం

ABN , Publish Date - Apr 19 , 2025 | 06:36 PM

దేశంలో కుమార్తెలను పెంచడం తల్లిదండ్రులకు ఒక బాధ్యత మాత్రమే కాదని, ఓ వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Viral News: భారతదేశంలో కుమార్తెలను పెంచడం అంత ఈజీ కాదు.. ఒక విప్లవం
Raising Daughters in India

భారతదేశంలో కుమార్తెలను పెంచడం కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. ఇది ఒక విప్లవంగా మారుతోందని బెంగళూరుకు చెందిన అజిత్ శివరామ్ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో సవాళ్లు, లింగ వివక్ష సహా అనేక విషయాలను నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం, తన ఇద్దరు కుమార్తెలు యూనిఫామ్‌లు ధరించి, వారి కలలను సాకారం చేసేందుకు సిద్ధమవుతారు. కానీ, ఈ ప్రపంచంలో అడుగు పెట్టేటప్పుడు, వారు ఎదుర్కొనే సవాళ్లు చాలా ఉంటాయన్నారు.


పితృస్వామ్య సమాజంలో బాలికలను పెంచడం

వారి ఆశయాలను ప్రశ్నించే, వారి నవ్వులను నియంత్రించే, వారి విలువను కొలిచే ప్రపంచంలోకి వారు అడుగు పెడుతున్నారని వెల్లడించారు. భారతదేశంలో పితృస్వామ్య సమాజంలో బాలికలను పెంచడం అంత ఈజీ కాదన్నారు. ఇది ఒక బాధ్యత మాత్రమే కాదు, నాయకత్వం, అవగాహనను పునర్ నిర్మించడంలో సహాయ పడుతుందన్నారు.


కార్యాలయంలో అసమానత

తన కుటుంబంలో కొడుకు లేకపోవడం గురించి బంధువుల నుంచి వచ్చే సూటి పోటి ప్రశ్నలు, పొరుగువారు కూడా ఆడపిల్లల గురించి మాట్లాడే చర్చలు రోజు చూస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు తాను క్లయింట్ల కార్యాలయాలను సందర్శించినప్పుడు, సమావేశాలలో అంతరాయం కలిగించే మహిళలను కూడా చూసినట్లు చెప్పారు. తప్పుడు వ్యక్తులకు ఆపాదించబడిన ఆలోచనలు, పలువురిని పనిలో ఉంచుతాయన్నారు. కానీ అటువంటి క్రెడిట్ అదృశ్య శ్రమ వంటిదని అజిత్ అన్నారు.


హీరోగా చిత్రీకరించుకునే బదులు..

ప్రస్తుతం నాయకత్వం గదుల్లో నేర్చుకోబడటం లేదన్నారు. ఇది విందు టేబుళ్ల వద్ద నేర్చుకుంటున్నట్లు చెప్పారు. తనను తాను హీరోగా చిత్రీకరించుకునే బదులు, తనని మిత్రుడిగా గుర్తించాలని పిల్లలకు చెప్పినట్లు వెల్లడించారు. ప్రతి రాత్రి, నేను ఇంటికి వెళ్లిన తర్వాత తన ఇద్దరు అమ్మాయిలు ఓ అరుదైన ప్రశ్న అడుతారని చెప్పారు. ఆ క్రమంలో మీరు ఈ రోజు ప్రపంచాన్ని మన కోసం కొంచెం మెరుగుపరిచారా అని అడుగుతారని వెల్లడించారు.

ఆ క్రమంలో కొన్ని రోజులు నేను అవునని చెప్పగలను. కానీ చాలా వరకు నేను చేయలేనని చెప్పినట్లు అజిత్ తన భావాలను వ్యక్తం చేశారు. ఈ మార్పు కోసం మనం కృషి చేయాలని, ఎందుకంటే మన పిల్లలు ఈ ప్రపంచంలో తమ స్థానం సంపాదించుకోవడానికి, తమ కలలను సాకారం చేసుకోవడానికి, సమానత్వాన్ని సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించాలన్నారు.viral news'.JPG


ఇవి కూడా చదవండి:

Elon Musk: చైనా కాదు.. ఎట్టకేలకు భారత్ రానున్న ఎలాన్ మస్క్..కారణమిదేనా..


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 19 , 2025 | 09:10 PM