Share News

Urine Eye Wash: ఇదేం చికిత్స తల్లీ.. కళ్లను మూత్రంతో శుభ్రం చేసుకుంటున్న మహిళ

ABN , Publish Date - Jun 26 , 2025 | 02:12 PM

తన మూత్రాన్ని ఐ వాష్‌గా వాడుతున్న ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తారు. ఇది కంటి ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

Urine Eye Wash: ఇదేం చికిత్స తల్లీ.. కళ్లను మూత్రంతో శుభ్రం చేసుకుంటున్న మహిళ
Urine Eye Wash Video

ఇంటర్నెట్ డెస్క్: తన కళ్లను తన మూత్రంతో రోజూ శుభ్రం చేసుకుంటానంటూ పూణెకు చెందిన ఓ మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ తీరు ఛీదర పుట్టిస్తోందని కొందరు అంటుంటే మరికొందరేమో ఆమెకు మానసిక చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. ఈ ఉదంతంపై (Urine Eye Wash Video) ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.

నూపుర్ పిట్టీ అనే మహిళ ఈ వీడియో షేర్ చేశారు. ఆమెకు ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై మక్కువ అధికం. ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సినవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయని ఆమె బలంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఈ చికిత్సను కూడా నెట్టింట షేర్ చేశారు. తను కంటిని మూత్రంతో ఎలా శుభ్రం చేసుకుంటోందీ కూడా చూపించారు. మూత్రం ప్రకృతి ప్రసాదించిన ఔషధం అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.


ఇందుకోసం మూత్ర విసర్జన సమయంలో ముందు కొంత వదిలిపెట్టాక మిగిలిన దాన్ని సేకరించాలని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత రెండు చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ మూత్రాన్ని నింపి అందులో కళ్లు పెట్టి రెప్పలు పలు మార్లు మూసి తెరవాలట. ఇలా చేస్తే కళ్లు తడారిపోవడం, ఎర్రబడటం, ఇరిటేషన్ వంటివి తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. ఇది సహజసిద్ధమైన ప్రత్యామ్నాయ హీలింగ్ విధానమని వివరించారు.

ఇక ఈ వీడియో నెట్టింట కాలు పెట్టగానే కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చి పడ్డాయి. జనాలు ఆమెను దుమ్మెత్తిపోశారు. రోత పుట్టించే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అంటూ మండిపడ్డారు. మహిళకు మానసిక చికిత్స అవసరమని కొందరు అభిప్రాయపడ్డారు. లివర్ డాక్ పేరిట నెట్టింట యాక్టివ్‌గా ఉండే ఓ కేరళ వైద్యుడు ఈ ఉదంతంపై స్పందించారు. మూత్రం క్రిమి రహితం కాదని స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్లకు దారి తీయొచ్చని అన్నారు. ఇది భయానకంగా ఉందని కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా డాక్టర్ అభిప్రాయంతో ఏకీభవించారు. మూత్రం కారణంగా కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. ఇదేం తెలివి బ్రో..

అమెజాన్ అధినేత పెళ్లి ఆహ్వానపత్రిక వైరల్.. తిట్టిపోస్తున్న జనాలు

Read Latest and Viral News

Updated Date - Jun 26 , 2025 | 02:33 PM