PUBG Addict Woman: పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. భర్త, కొడుకును వదిలి..
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:23 PM
PUBG Addict Woman: కొన్ని రోజుల క్రితం షీలు, ఆరాధనను కొట్టాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి శివమ్‌కు చెప్పింది. దీంతో శివమ్ లుథియానా నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహోబాకు వచ్చాడు.
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పబ్జీ ఆటలో పరిచయం అయిన సచిన్ అనే యువకుడి కోసం భర్తను వదిలేసి నోయిడా వచ్చేసింది. అతడ్ని పెళ్లి చేసుకుని ఇండియాలోనే సెటిల్ అయిపోయింది. సీమా హైదర్, సచిన్ల ప్రేమ కథకు పబ్జీనే కారణం అయింది. ఉత్తర ప్రదేశ్‌లో పబ్జీ కారణంగా మరో ప్రేమ కథ పుట్టింది. వివాహిత మహిళ, ఓ యువకుడికి పబ్జీ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రియుడి కోసం ఆ వివాహిత భర్త, కొడుకును వదిలేసింది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బంద జిల్లాకు చెందిన ఆరాధనకు మహోబాకు చెందిన షీలు అనే వ్యక్తితో 2022లో పెళ్లయింది. వారికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. ఆరాధన గత కొన్నేళ్ళ నుంచి పబ్జీకి బానిస అయింది. పెళ్లయిన కొన్ని నెలలకే పబ్జీ ద్వారా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన శివమ్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఇద్దరూ తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
కొన్ని రోజుల క్రితం షీలు, ఆరాధనను కొట్టాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి శివమ్‌కు చెప్పింది. దీంతో శివమ్ లుథియానా నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహోబాకు వచ్చాడు. ఆరాధన ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే షీలు, శివమ్‌లకు గొడవైంది. షీలు పోలీసులను పిలిపించాడు. వారు అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆరాధన పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనకు ప్రియుడే కావాలని, అతడితోటే ఉంటానని తెగేసి చెప్పింది.
తన భర్త తాగుబోతని, ఎప్పుడూ హింసిస్తూ ఉంటాడని కూడా అంది. పోలీసులు శివమ్ మీద కేసు బుక్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. అయితే, ఆరాధన తన భర్తకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమ ప్రేమకు అడ్డుగా వస్తే.. 55 ముక్కలుగా నరికి, డ్రమ్ములో పడేస్తానని అందట.
ఇవి కూడా చదవండి
తెలంగాణను జల్లెడ పడుతున్న ‘గద్దలు’.. ఇట్టే పట్టేస్తాయి..
ఈ మంత్రం జపిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితాన్ని మార్చేస్తాయి!