Share News

Devotional Tips: ఈ మంత్రం జపిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితాన్ని మార్చేస్తాయి!

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:03 PM

హిందూ మతంలో శుక్రవారాలలో లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీనిని సంపద, శ్రేయస్సు కోసం చేస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందం, సంపద లభిస్తాయని నమ్ముతారు.

Devotional Tips: ఈ మంత్రం జపిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
Lakshmi Devi

Lakshmi Devi Blessings: హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం.. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే.. సంపద, శ్రేయస్సు కలుగుతుందని ప్రజల విశ్వాసం. లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందం, సంపద లభిస్తాయని నమ్ముతారు. శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. శుక్రవారం రోజున భక్తులు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రత్యేక మంత్రాలు జపిస్తారు. అలాగే, దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీ దేవిని పూజించడం వలన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.


లక్ష్మీ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా సంపద, విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఉప్పు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పసుపు, కుంకుమ కలిపిన ఉప్పును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం మంచిది. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీ దేవికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని.. సంపదలు, శ్రేయస్సు కలుగుతుందని చెబుతుంటారు. మరి ఆ రోజున ఏ మంత్రాలు పఠించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున ఈ మంత్రాలు పఠించండి..

  • శ్రీ లక్ష్మీ బీజ మంత్రం.

  • లక్ష్మీ ప్రార్థన మంత్రం.

  • లక్ష్మీ దేవి మహామంత్రం.


ఈ మంత్రాలను జపించడం ద్వారా మీరు లక్ష్మీ దేవి ఆశీస్సులను పొందుతారు. మీ జీవితంలో ఆనందం, సంపద, అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. ఈ మంత్రాలను జపించడం వల్ల ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..

రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..

For More Lifestyle News

Updated Date - Jun 26 , 2025 | 08:17 PM