Share News

Savings: రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:11 PM

లైఫ్‌లో ఆర్థిక భద్రత ఉండాలంటే సంపాదనతో పాటుగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. మీరు ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి, మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.

Savings: రోజూ సంపాదిస్తున్నా రూపాయి కూడా మిగలడం లేదా.. ఈ అలవాట్లే కారణం..
Savings

Savings: చాలా మంది ఎక్కువగా సంపాదించి మంచి భవిష్యత్తు కోసం డబ్బును సేవింగ్స్ చేయాలని అనుకుంటారు. అలాంటి వారు ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడమే కాదు, ఖర్చులపై నియంత్రణ కూడా కలిగి ఉండాలి. అయితే, ఎంత సంపాదించినా సరే కొన్ని చెడు అలవాట్లు ఉంటే చివరికి ఒక్క రూపాయి కూడా మిగలదు. లైఫ్ లో ఆర్థిక భద్రత ఉండాలంటే సంపాదనతో పాటుగా ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. మీరు ఎంత సంపాదించినా చివరికి మీ దగ్గర రూపాయి కూడా ఉండదు. కాబట్టి, ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.


ఆడంబర జీవితం:

ఆదాయం ఎంత ఉన్నా దానికి మించిన ఖర్చులు చేస్తూ ఉంటే సంపాదించినంతా నష్టమవుతుంది. బ్రాండెడ్ వస్తువులు, పనికిరాని వస్తువుల మీద డబ్బు వృధాగా ఖర్చు చేయడం మంచిది కాదు. కాబట్టి, మీ ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం తగ్గించుకోండి. ఇష్టానుసారంగా షాపింగ్ చేయడం, అవసరం లేని వస్తువులు కొనడం అలవాటు ఉంటే మానుకోండి.

అప్పు:

డబ్బు చేతిలో లేకపోయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయని కొంతమంది అదేపనిగా ఖర్చు చేస్తుంటారు. లేదా ఇతరుల దగ్గర అప్పు చేస్తుంటారు. అయితే, ఇది వడ్డీల రూపంలో మరింత నష్టాన్ని కలిగిస్తుంది.


భవిష్యత్తును పక్కన పెట్టడం:

కొంతమంది కేవలం ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తూ భవిష్యత్తు అవసరాల గురించి పట్టించుకోరు. ఇలా ఉంటే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి, భవిష్యత్ అవసరాల కోసం సేవింగ్స్ చేయడం మంచిది.

ఆలస్యం చేసే పెట్టుబడులు:

ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చులు చేయడం వల్ల దానిని పెట్టుబడిగా మార్చే అవకాశం కోల్పోతారు. ఈ అలవాటు నెమ్మదిగా ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈ అలవాట్లలో ఒక్కటి ఉన్నా డబ్బు మిగలడం చాలా కష్టం. కాబట్టి, ఈ అలవాట్లను మార్చుకోవడం మంచిది.


ఏమి చేయాలి?

  • ఖర్చులకు బడ్జెట్ తయారు చేయండి.

  • ప్రతి నెలా కొంత మొత్తాన్ని సేవింగ్స్‌కు కేటాయించండి.

  • అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వండి.

  • అప్పులు తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి.

  • భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు చేయండి.


Also Read:

ఇంట్లో అతి ఖర్చులు.. ఇలా కంట్రోల్ చేయండి..

ఇంట్లో ఈ చోట్ల టీవీ పెడితే డేంజర్.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోవచ్చు..

For More Lifestyle News

Updated Date - Jun 25 , 2025 | 01:53 PM