Share News

EAGLE: తెలంగాణను జల్లెడ పడుతున్న ‘గద్దలు’.. ఇట్టే పట్టేస్తాయి..

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:07 PM

EAGLE For Drug Control: డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ (Elite Action Group for Drug Law Enforcement)ను రంగంలోకి దింపారు.

EAGLE: తెలంగాణను జల్లెడ పడుతున్న ‘గద్దలు’.. ఇట్టే పట్టేస్తాయి..
EAGLE For Drug Control

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్‌ నివారణపై ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమ గంజాయి పెంపకంతో పాటు డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ (Elite Action Group for Drug Law Enforcement)ను రంగంలోకి దింపారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రం కోసం ఈగల్ నేటి నుంచి పని మొదలు పెడుతోందని సీఎం రేవంత్ తెలిపారు.


ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈగల్‌కు సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో..‘తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా.. డ్రగ్స్‌తో రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడతాయి. గంజాయిని గమనించినా.. డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా.. క్షణంలో పట్టేస్తాయి. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రజా ప్రభుత్వంతో ప్రతి ఒక్కరు కలిసి నడవాలని కోరుతున్నాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

టీడీపీ నేత ఇంట్లో భారీ దొంగతనం..

కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్

Updated Date - Jun 26 , 2025 | 08:13 PM