Share News

Dog Mom Rescues Pet: పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగించిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:35 PM

ఓ యువతి తన పెంపుడు కుక్క కోసం ఎవ్వరూ ఊహించని పని చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్కను రక్షించడానికి తన ప్రాణాలకు తెగించింది. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

Dog Mom Rescues Pet: పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగించిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో..
Dog Mom Rescues Pet

కొంతమంది తమ పెంపుడు జంతువులను కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. తమకు కష్టం కలిగినా భరిస్తారేమో కానీ, పెంపుడు జీవులకు కష్టం వస్తే భరించలేరు. పెంపుడు జంతువుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. తమ పెంపుడు జంతువులపై తమ ఆస్తిని మొత్తం రాసిన వింత మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. తాజాగా, ఓ యువతి తన పెంపుడు కుక్క కోసం ఎవ్వరూ ఊహించని పని చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్కను రక్షించడానికి తన ప్రాణాలకు తెగించింది. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మండేయి సిటీలోని సెబు ప్రాంతానికి చెందిన ఓ యువతి కుక్కను పెంచుకుంటూ ఉంది. ఆ కుక్కను కన్నబిడ్డలా ఎంతో ప్రేమగా సాగుతూ ఉంది. దానికి అన్ని సౌకర్యాలు కల్పించింది. కొద్దిరోజుల క్రితం ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఆమె ఉండే ప్లాట్‌ను కూడా చుట్టుముట్టాయి. మంటలు మొదలైన వెంటనే ఆమె తప్పించుకోవటానికి ఆస్కారం ఉండింది. అయితే, ఆమె తన కుక్క కోసం బాల్కనీలోనే ఉండిపోయింది. కుక్కను తన చేతుల్తో పట్టుకుని నిలబడిపోయింది. ఇక, అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.


ఆమెను కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆమె కింద ఉన్న వలలో కుక్కను పడేసింది. తర్వాత ఎంతో కష్టం మీద నిచ్చెన సాయంతో కిందకు దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది ఆమెను తిడుతూ ఉంటే మరికొంతమంది పొగుడుతూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

అసలు తుమ్ములు ఎందుకు వస్తాయి.. కారణాలు ఏంటో తెలుసా?

అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు.

Updated Date - Dec 13 , 2025 | 01:38 PM